పోరాటం
తిందామంటె అరగదు..
అరగాలని వాకింగ్ కి..
వెళదామంటె..
కాళ్లు రానంటున్నాయి..
నొప్పులంటున్నాయి..
పోనీలే! అనుకుని..
కూచుని కథయినా..
రాసుకుందామంటె..
నడుం నేను కూచోనంటుంది..
దానికీ నొప్పేనట..
అయ్యెా! రామ అనుకుని..
బెడ్ పై వాలి ఫోన్ లో కథ..
లయినా చదువుదామంటె..
కళ్లు చదవనంటున్నాయి..
వాటికీ నొప్పేనట తెరవమని..
మెురాయిస్తున్నాయి..
సరె కానీ నీకు కళ్లజోడు తగిలిస్తా..
కనీసం ఈ చిన్న…
కవితయినా రాద్దామంటె…
సరె అన్నాయి..
అందుకే రాసా ఈ కవిత..
అనునిత్యం నా అవయవాలతో..
బ్రతుకు పోరాటం చేస్తూ రాస్తున్నా!!
-ఉమాదేవి ఎర్రం.