పోరాటం
బ్రతకడం కోసం పోరాటం
విరామం లేని జీవితం
శ్రమని నమ్ముకుని బ్రతికే కర్షకులు
ఋతువులతో పనిలేని వీరులు…
కష్టాలకి ఓదార్పు కరువు
సంతోషం అనేదే లేదు..
కుటుంబం కొరకు కూలి
ఎప్పుడూ ఏదో ఒక పని
గుండెల్లో రోజూ ప్రళయం
దిక్కు లేదు, ఉన్నదోకటే కష్టం
పని ఉంటే భుక్తి లేకుంటే పస్తు
అయినా వాళ్ళు గుర్తుకొస్తే కన్నీళ్లు
తప్పదు వాళ్ల కోసం ఈ పాటులు
సంపాదన చూసి సంతోషం
ఏదో సాధించాను అనే గర్వం
ఇంత అత్యంత దౌర్భ్యాగ్యపు స్తితి లో మనిషి మనుగడ సాగుతున్నా చూస్తూ విధి అనుకుంటున్నాం
ప్రభుత్వ పథకాల కరువు
ఇలాంటి సామాన్య కూలీలకి పెద్ద బరువు…
ఎప్పటికీ మారునో ఈ వైనం…
– కుమార్ రాజా