పోన్నియన్ సెల్వన్
పోన్నియన్ సెల్వన్ అనే మణిరత్నం సినిమా తమిళంలో వచ్చింది దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ఈ సినిమా మన తెలుగు వాళ్లకి అస్సలు నచ్చలేదు.
మరి ఈ సినిమా మన తెలుగు వాళ్లకి ఎందుకు నచ్చలేదు అసలు వసూళ్లు ఎందుకు రాలేదు మణిరత్నం సినిమా అంటే చాలా ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకొని ఖచ్చితంగా హిట్ చేసే మనవాళ్లు ఎందుకు ఈ సినిమాని ఆదరించలేకపోయారు? అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం..
ఇక్కడ నేను కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఎవరిని కించపరచడానికి ఎవరిని తక్కువ చేయడానికి చేయడం లేదు.
ఇక కథ విషయానికొస్తే, రాజుల మధ్య జరిగే అంతర్యుద్ధ కథనమే ఈ సినిమా.. చోళుల రాజు కి ఇద్దరు కొడుకులు వారిలో పోన్నియన్ సెల్వన్ అనే అతను చిన్నప్పుడే నదిలో పడిపోతే వనదేవత కాపాడిందని అక్కడి వారంతా నమ్ముతారు అందుకే అతన్ని కాపాడుకోవడానికి దేశమంతా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అతను దేవుడిచ్చిన బిడ్డగా కొలుస్తూ అతనికి ఎలాంటి కష్టం రాకుండా చూస్తూ ఉంటారు. అదే సమయంలో తాను ప్రేమించిన యువతి దూరమైందని అతని అన్న శత్రు రాజ్యాలు ఏవి ఉన్నాయో చూసుకుంటూ తన రాజ్యాన్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని మొత్తం రాజ్యానికి అంకితం చేస్తాడు.
అదే సమయంలో, అతని తండ్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో దాని అలుసుగా చేసుకున్న సామంత రాజులు, సేనాదిపతితో కలిసి సెల్వన్ అంటే చక్రవర్తి రెండో కొడుకుని చంపాలని ప్రయత్నం చేస్తూ అలాగే రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు.
వారికి వేగు అయిన కార్తీ ద్వారా విషయం తెలుసుకున్న చక్రవర్తి తన పిల్లల్ని తన దగ్గరికి పిలిపించాలని అనుకుంటాడు. కానీ పోన్నియన్ సెల్వన్ తను రానని చెప్పడంతో అతనిని బందీగా అయినా తీసుకురమ్మని పంపిస్తాడు చక్రవర్తి. అయితే ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ అనేది తెలుస్తుంది.
అన్న ప్రేమించిన అమ్మాయి రూపంలో ఉన్న దేవత తనని చిన్నప్పుడు రక్షించిందని ఆ దేవతలను వెన్నంటి నీడలా తిరుగుతుంది అనేది తెలుస్తుంది. అక్కడితో ఈ సినిమా ముగుస్తుంది. అంటే ఇక్కడ అన్న ప్రేమించిన ఆవిడ దూరమైంది ఆ దూరమైంది ఎవరో కాదు తనను రక్షించే ఆవిడే మరి ఇప్పుడు వీళ్ళ రాజ్యానికి అడ్డుపడేది ఎవరు? ఇద్దరూ ఒకే పోలికలతో ఎలా ఉన్నారు? అసలు ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు రెండో భాగంలో తెలియవచ్చు.
ఒక నవలగా వచ్చిన దాన్ని సినిమా చేయడం అంటే కత్తి మీద సామే. కానీ చరిత్రపై ఉన్న ఇష్టంతో చరిత్ర కథను మణిరత్నం సార్ తనకు తోచినంతలో చరిత్రను ఇలా చెప్పడానికి ప్రయత్నం చేశారు అని మనం భావించవచ్చు. చరిత్ర గురించి తెలుసుకోవాలని తపన ఉన్నవారు ఈ సినిమాను ఒక రెండు మూడు సార్లు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది.
అలాగే మనం చిన్నప్పుడు 8, 9, 10 తరగతులలో చదువుకున్న సాంఘిక శాస్త్రంలో రాజరాజ చోళులు, కాకతీయులు, పల్లవుల వంటి వారి గురించి కొంచెం అవగాహన ఉన్న ఎవరికైనా ఈ కథ ఈజీగా అర్థమవుతుంది.
తమిళ రాజుల గురించి తమిళ వారికి చెప్పడం వారికి సంతోషం ఇచ్చిందేమో కానీ మన తెలుగువారికి ఎందుకో నచ్చలేదు ఎందుకంటే బాహుబలి లాంటి ఒక సుందర అందమైన దృశ్య కావ్యాన్ని చూసిన కళ్ళతో ఇలాంటి కుళ్ళు కుతంత్రాల కథని చూడలేకపోయారు మన తెలుగు ప్రేక్షకులు.
అందువల్లే ఈ సినిమా మనల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక చరిత్ర గురించి అంతో ఇంతో తెలిసిన వారికి ఆ తర్వాతి భాగంలో ఏం వస్తుంది అనేది కొంచెం కుతుహలం రేపుతుంది. అలాగే చాలామంది కూడా రెండో భాగంలో ఏముంటుందో ఇస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇందులో రెండో భాగం లో ఐశ్వర్యరాయ్ డబుల్ సీనుగా అలాగే ఐశ్వర్య రాయికి జోడిగా నటించిన నాజర్ కూడా డబుల్ సీన్ అని తెలిసిపోతుంది.
అయినా ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం ఏంటంటే ఐశ్వర్యరాయ్ కి జోడిగా నాజర్ ని పెట్టడం ఏంటి? అనేది కొంచెం డిసప్పాయింట్ కలిగిస్తుంది. వయసులోనూ అనుభవంలోనూ చాలా పెద్దవాడైన నాజర్ ని ఐశ్వర్యరాయ్ కి జోడిగా పెట్టారు అది కొంచెం కళ్ళకు విందుగా లేకుండా నిజమైన కథలో ఇలాగే జరిగిందేమో అనే ఊహ మనల్ని ఆకట్టుకుంటుంది.
తెలుగువారికి అనుగుణంగా డబ్బ్ చేసినప్పుడు మనకు అనుకూలంగా పేర్లు కూడా పెట్టాల్సి ఉంది. కొన్ని మాటలు మనసుపెట్టి వింటే తప్ప మనకు అర్థం కావు. తనికెళ్ల భరణి రాఘవ లాంటి వారితో డబ్బింగ్ చెప్పించిన మిగిలిన వారికి కూడా మన తెలుగువారి చేత డబ్బింగ్ చేపిస్తే బాగుండేది.
మొత్తానికి చరిత్ర కాస్తో కూస్తో తెలిసిన వారికి ఈ సినిమా అర్ధమయినా అసలు ఏమీ తెలియకుండా మణిరత్నం సినిమా అని వెళ్లిన వాళ్లకి మాత్రం సినిమా నిరాశ కలిగిస్తుంది. అయినా ఎత్తుకున్న పాయింట్ పెద్దది కాబట్టి మణిరత్నం సార్ ని అభినందించాల్సిందే. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
– భవ్య చారు