పొడబారని స్థబ్ధత

పొడబారని స్థబ్ధత

తన నిర్ణయం నిలువని తొలి పొద్దని
నీటమునిగిపోదు…స్నేహమై పరిచిన
పరుపులలో అలసిన సొధలను నిదురింప
నీయదు…కదలిరాలేని బంధాలను చూసి
తోడు లేదనీ దుఃఖించదు…కదిలే స్థానం
వెన్నెల్లో పాలబువ్వలను కలిపినా
చేసిన వేదికలపై పాదాలను కడగదు…

పొడబారని స్థబ్ధత…!!
నిలువని నీడలతో నింగి ఎరుగని
నిశ్శబ్దమని…గమనంతో నిత్య ప్రయానమైనా
ఎదలు నింపుకోదు కష్టమనినా కన్నీటితో
కరిగిపోదు…కదిలే సమయాన్ని కరిగిపోని
వయస్సుగా ప్రకృతిని పలకరిస్తు…
చీకటి వెలుగులను కలిగిన సహజ
సిద్ధాంతాలై నిలిచిన సంతతిగా నెగడాలని
చూడదు…

కలిసి మెలిసిన జీవితాల కవనం
ఐకమత్యమైతే…వెన్నెల్లో కలిపిన
బువ్వగా మెదుగు పడుతుంది…తెలియని
బతుకుల చిత్తం చిరిగిపోయిన విస్తరైతే…
క్షణాలను నిలువునా కూల్చేస్తుంది…
గమ్యం కనిపించక పోయినా ఆధారానికై
వెదకదు…విరుచుకు పడిన గర్వాన్ని
లక్ష్యంగా నడపాలని చూడదు…

కల్లలు కవ్వింపులు కావని విజయం తో
విసుగెత్తుతు ఎల్లల ఉనికిన కోల్పోదు…
చిలికే కవనమై మరణం లేని శాసనంగా
కాలాను గుణాలను తేల్చుతు…
ప్రజ్ఞ చేసిన మార్మికాలను కప్పుకొని
సరళీకృతాలతో నిర్మించుకొన్న తపనతో
కాలచక్రమై కదులుతుంది అదే మానవ
లోకానికి ఆధారం అధ్యాయం…

 

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *