పిల్లలు మారాలి
చిన్న పిల్లలు పెద్దవారిలాగా ప్రవర్తిస్తున్నారు. దానిని పెద్దలు
కూడా స్వాగతిస్తూ ఉన్నారు.
కొందరు పిల్లలు తల్లిదండ్రుల
ముందు బాగానే ప్రవర్తిస్తారు
కానీ తమ మిత్రులతో చాలా
దారుణంగా మాట్లాడుతూ
ఉంటారు. వారు మాట్లాడే
మాటల్లో ఎక్కువ బూతులు
దొర్లుతున్నాయి. మరికొందరు
పిల్లలు తల్లిదండ్రులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ఆ
పిల్లలు తల్లిదండ్రుల ముందే
ఇలా ప్రవర్తిస్తే రేపొద్దున తన
చుట్టూ ఉండే సమాజంతో
మంచిగా ఉంటారని మనం
ఎలా ఆశించగలం. ఈ విధానం
మారాలి. పిల్లలు పిల్లలుగానే
ప్రవర్తించాలి. అలా ప్రవర్తించే
విధంగా తల్లిదండ్రులు తమ
వంతు ప్రయత్నం చేయాలి.
వారు పెద్దలను, గురువులను
గౌరవించే విధంగా చూడాలి.
-వెంకట భాను ప్రసాద్ చలసాని
పిల్లలు మారాలంటే వారు పెద్దవారి సలహా సూచనలను పాటించాలి.