పిల్లలు
పిల్లలం పిడుగులం
రేపటి భవితలం
ఆడుతూ పాడుతూ
కాలాన్ని గడిపేస్తాం
భవిష్యత్తు బాటలకు
వెలుగునిచ్చే ప్రమిదలం
భూగోళాన్ని చుట్టే బుజ్జి అడుగులు
నింగినితాకే మా కేరింతలు
భయమేస్తే అమ్మఒడిన చేరేములే
బామ్మపక్కజెరి కథలు వింటూ
బడికెళ్ళము అంటూ మారంచేస్తూ
ఆదివారమొస్తే గట్టుమీద చేరి
మట్టి ఆటలు ఎన్నో ఆడుకుంటాము
అలసటనంతా తీరుస్తాము నవ్వులతో
చాచా నెహ్రూ ఇష్టపడెంతగా
తప్పటడుగులుసరిచేసుకుంటూ
భావి భారతాన్ని నిర్మిస్తాం
– హనుమంత