పిల్లలకు కాలం విలువ తెలియజేయండి

పిల్లలకు కాలం విలువ తెలియజేయండి

తిరుగుతున్న కాల చక్రాన్ని
ఆపడం ఎవరి తరమూ కాదు.
అది నిరంతరం తిరుగుతూనే
ఉంటుంది. మనం కేవలం ఆ సమయాన్ని సద్వినియోగం
చేయగలం. డబ్బులు వృధా
చేసినా మరల మనం సంపాదించుకోవచ్చు కానీ
సమయాన్ని దుర్వినియోగం
చేస్తే కోల్పోయిన సమయాన్ని మళ్ళీ మనం తిరిగి పొందలేం.
ఈ సత్యం గ్రహించి సమయాన్ని సరిగ్గా ఉపయోగించిన వాళ్ళు చరిత్రలో గొప్పవారిగా ఎప్పటికీ మిగిలిపోతారు. పిల్లలకు
సమయం విలువను తప్పక
తెలియజేయాలి. ఆ వయసులో వారు చదువు
పట్ల శ్రద్ధ చూపించకపోతే
వారి భవిష్యత్తు పాడవుతుంది.
వారి జీవితంలో మొదట ఇరవై సంవత్సరాలు అనుకున్న
ఆశయం కోసం కృషిచేస్తే
మిగతా జీవితమంతా ఆ
కృషి ఫలితాన్ని అనుభవించవచ్చు అని
పిల్లలకు తెలియచేయాలి.
కాలం విలువ తెలిసిన
విద్యార్థులు తమ సమయాన్ని
తమ లక్ష్య సాధనకే వినియోగిస్తారు. నాకు
తెలిసి ఎంతో మంది
పిల్లలు సరైన అవగాహన
లేక సమయాన్ని సరిగ్గా
వాడుకోకపోవడంతో వారి
జీవితం దుర్భరంగా మారింది.
ఆ తర్వాత ఎంత వగచినా
లాభం లేదు. సరైన సమయంలో సరైన
నిర్ణయం తీసుకుని
ముందుకు ఎదగండని
పిల్లలకు కావలసిన ప్రేరణ ఇద్దాం.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *