పిల్లల భవిష్యత్తు కోసం
రసూల్ నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అతనికి ఇద్దరుపిల్లలు. అందులో ఒకరుపాప,ఒకరు బాబు. ఇద్దరూఆరోగ్యంగా ఉన్నారు. చక్కగా
చదువుకుంటున్నారు. ఒకరోజురసూల్ తండ్రి రసూల్ ఇంటికివచ్చి”చూడు బేటా రసూల్ నువ్వు ఎంతమంది పిల్లలనుకంటే అంత మంచిది. మన యొక్క కుటుంబ బలగం పెరుగుతుంది. దేవుడిచ్చినపిల్లలను దేవుడే సాకుతాడు.భయపడవద్దు.”అని అన్నాడు.అదే విషయాన్ని రసూల్ తనమితృడితో చెప్పాడు. అప్పుడుఆ మితృడు”చూడు రసూల్,ఎక్కువ మంది పిల్లలుంటే వారిని పోషించడం మనలాంటిమధ్య తరగతి పౌరులకు కష్టం.అదీకాక మహిళల ఆరోగ్యంకూడా దెబ్బతింటుంది. ఒక్కొక్కప్రసవం వారికి ఒక్కొక్క జన్మలాంటిది. పూర్వం ప్రజలకుపాడి-పంటలు సమృద్ధిగా ఉండేవి కాబట్టి ఎంతమందిపిల్లలు ఉన్నా ఇబ్బందిగా
ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.ఇప్పుడు ఖర్చులు పెరగిపోయాయి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిబాగోగులను చూడడంచాలా కష్టం.”అని చెప్పాడు.మితృని మాటలను విన్న రసూల్ ఆలోచనలో పడ్డాడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని