పేరు లేని బంధం
పేరు లేని బంధాలకు కూడా ప్రేమ అనే రుణ బంధమే!
మన కోసమై వెచ్చించిన సమయం ఎదుటివారితో వేరుపడని బంధమే కదా!
మరొకరితో మృదు భాషనైనా చేయు సేవ అయినా మనకు ఉపశమనమే !
కొన్ని బాధ్యతలు పేరు లేని బంధాలను మోసుకొస్తాయి
పెంపుడు జంతువులు విశ్వాసనీయ సహచరులు
ఏకాంతపు చీకటిలను తొలగించే సహవాసకులు
ఇది పేరు లేని బంధమే!
ఒంటరితనాన్ని తెలియకుండా చేసే వ్యవసాయ క్షేత్రాలు
బంధమై నిలిచేను !
అణువణువు నా అభిమానాన్ని నింపుకుంటూ నివసిస్తున్న గృహం ఉత్తమమైన బంధం!
నలిగే మనసుకు నాలుగు దిక్కులే తోడుగా అందించే అందమైన బంధం!
కాల క్షేపం కోసం సంతోషాన్ని ఇచ్చే
మీడియా సాధనాలు అన్ని
బోధపడే బంధాలే!
ప్రేమకు వారదులుగా నిలిచి మానవతను
నింపే ప్రతిఒక్కటి మనిషి
మైత్రీవనంలో పేరు లేని బంధాలుగా
మిగులుతాయి…..?
– జి జయ