పెళ్ళి అంటే నూరేళ్ళ పంట
పెళ్ళంటే నూరేళ్ళ పంట. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే కుదురుతాయి అంటారు.
అంటే మనిషి పుట్టినప్పుడే
అతని జాతకంలో జీవిత భాగస్వామి ఎవరవుతారో
వ్రాసి పెట్టబడి ఉంటుంది
అనేది పెద్దలు నమ్ముతారు.
పెద్దలు కుదిర్చిన సంబంధాలే
ఎక్కువగా సక్సెస్ అవుతాయి
అని చాలా మంది విశ్వాసం.
ఎవరికైనా పెళ్ళి సంబంధాలు కుదిర్చేటప్పుడు అటు ఏడు
తరాలు,ఇటు ఏడు తరాలు
చూసిన తర్వాతే పెళ్ళిళ్ళు
కుదర్చాలని అంటుంటారు.
అలా అన్ని విషయాలు బాగా
కనుక్కుని చేయటం వలన
పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు
సక్సెస్ అవుతాయేమో. అంతేకాకుండా ఒకవేళ
పెళ్ళి చేసుకున్న జంట
మధ్య ఏమైనా గొడవలు
వచ్చినా పెద్దలు కల్పించుకుని
ఆ సమస్య పరిష్కారాన్ని
సూచిస్తారు. వెయ్యి అబద్ధాలు
చెప్పి అయినా ఒక పెళ్ళి చేయాలి అనేది పాత మాట.
ఇప్పుడైతే అబద్ధాలు చెప్పే
పనే లేదు. అన్ని విషయాలు
బహిరంగంగా చర్చించుకుని
పెళ్లి సంబంధాలు కుదిర్చే
మ్యారేజ్ బ్యూరో వాళ్ళు
అన్ని చోట్లా ఉన్నారు. పెళ్ళి
చేసుకునే వయసులో ఉన్న
యువతీ యువకుల పేర్లను
సేకరించి, వారి పుట్టు పూర్వోత్తరాలు కనుక్కుని
చక్కని జీవిత భాగస్వామిని
సెలెక్ట్ చేసుకునే అవకాశం
వారికి కల్పిస్తున్నారు. కళ్యాణం
వచ్చినా,కక్కు వచ్చినా ఆగదు
అనేది పెద్దల విశ్వాసం. ప్రేమ
పెళ్ళిళ్ళు ఎక్కువగా సక్సస్
అవ్వకపోవటానికి కారణం
ఆ జంటల మధ్య అవగాహన
లోపమే. పెళ్ళి ముందు
శారీరక ఆకర్షణ వల్ల ఒక్కటైన
ప్రేమ జంటలు పెళ్లి తర్వాత
అవగాహన లోపం వల్ల విడిపోతూ ఉంటారు. అదే
అనుభవజ్ఞులైన పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు సక్సస్
అయ్యి ఆ జంటలు ఎల్లకాలం
కలిసి ఉంటారు అనేది పెద్దల
ఉవాచ. ప్రేమ పెళ్ళి అయినా,
పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా
ఆ జంట మధ్య ప్రేమ లేకపోతే
ఆ బంధం ఎక్కువ కాలం
నిలబడదు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే మాట అక్షరసత్యం.