పవిత్రమైన ఓటును అపవిత్రం చెయ్యదు.
ఓటు సంస్కారవంతమైన ఆయుధం
సమయం వస్తే వదలి చూడు
తనివితీరా ఓటుతో కొట్టి చూడు
ప్రభుత్వాలే మార్పులోకి వస్తాయి…
అమూల్యమైనది ఓటు
వినియోగిస్తే తలరాతనే మారుస్తుంది
ప్రజాస్వామ్యాన్ని నిత్యం పరిరక్షిస్తూ
సామాన్యుని ఆయుధంగా పనిచేస్తుంది….
ప్రభుత్వాలు తయారు చేసేది ఓటే
మనం వేసే ఓట్లతో నిలబడేది ప్రభుత్వం
రాజ్యాంగం ఇచ్చిన అద్భుత శక్తి గల ఆయుధం
ప్రభుత్వాల తలరాతను మార్చే అధికారం..
ఓటు హక్కు వినియోగించుకుంటే
మనిషిగా బ్రతికి నిరూపించుకున్నట్లే
చచ్చిన వారిలా ఎందుకు ఉంటారు
బ్రతికున్నంత వరకు ఓటుతో నిలబడు…
మీ ఓటు నిర్లక్ష్యం అయితే
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే
మాటకన్నా వేసే ఓటు హక్కే మిన్న
ప్రభుత్వాన్ని మార్చే అవకాశం మూ ఓటుతోనే…
ఒక్క ఓటే అని తేలికగా చూడకు
గెలుపోటములు అదే నిర్ణయిస్తుంది
ప్రజాస్వామ్య విజయానికి తోడ్పడుతుంది
ఒక్కసారి వదిలితే తిరిగిరాని బాణము…
కులమతాలను వదిలి చూడు
ప్రజాస్వామ్య హితమును కాంచించు
ఓటు అమ్ముకొని శీలం కోల్పోవద్దు
పవిత్రమైన ఓటును అపవిత్రం చెయ్యొద్దు…
-గురువర్ధన్ రెడ్డి