పట్టపగలు వెండి పూదోటలో..
అవి అతి నీచ నికృష్ఠపు రోజులు.
అది ఎన్నో వెండి పుదోటల్లా దర్శనమిచ్చే మంచు పుష్పాలతో కప్పబడిన కాశ్మీరం..
భరతమాత కనుబొమ్మల మధ్య కుంకుమ మాదిరిగా విలసిల్లే కాశ్మీరం..
ఈ మహోన్నత భారతావని సౌభాగ్య రేఖ అయిన ఆ కాశ్మీరంలో ఉగ్రవాదులు అరాచకాలు సృష్టిస్తున్న వేళ..
పట్టపగలు ఎందరో భారతీయ వారసుల రుధిర ధారలు యేరులై పారుతున్న వేళ..
ఎందరో భారతీయ మానవతుల వలువలు ఒలిచి కీచక పర్వం ప్రదర్శిస్తున్న వేళ..
భరత ముత్తైదువతనాన్ని కబళిస్తున్న వేళ..
రక్షక తంత్రాలుగా భారత సైనిక దళం రంగ ప్రవేశం చేసి ఉగ్రవాద కుతంత్రాల మధ్య తమ ప్రాణాలను తృప్రాయంగా అర్పించి భరతావనికి రుధిరార్చన చేసారు.
ఇలాంటి సంఘటనలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఉగ్రవాదుల ఉన్మాదం భారతమాత నఖశిఖ పర్యంతం వణుకు పుట్టిస్తుంది.
దీనికి చరమాంకం ఎప్పుడో..
ఈ నరమేధం శాంతించేది ఎన్నడో..
– శంభుని సంధ్య