పాత కథే కానీ కొత్తగా

పాత కథే కానీ కొత్తగా

ఒక మహా పండితుడు తనకు సన్మానం జరగ బోతుంది అని తన శిష్యులతో కలసి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే నది దాటాలి.

కాబట్టి పడవ ఎక్కాలి. పండితుడు పడవ ఎక్కాడు. అతని భజన బ్యాచ్ కూడా పడవ ఎక్కారు.

పడవ అతను పడవని నడిపిస్తూ ఉన్నాడు. పండితుని కి ఆ పడవ వాడికి తన గొప్ప ఏంటో చెప్పాలని అనిపించింది.

దాంతో పండితుడు పడవ అతన్ని నీకు రామాయణం తెలుసా,  అంటూ అడిగాడు.  పడవ వాడు లేదని వినమ్రంగా సమాధానం ఇచ్చాడు.

పండితుడు శిష్యుల వైపు గర్వంగా చూస్తూ నీకు మహా భారతం తెలుసా అంటూ అడిగాడు. లేదని పడవ వాడు చెప్పాడు.

ఈ సారి పండితుడు నీకు పద్యాలు, శతకాలు, పురాణాలు,తెలుసా అంటూ అడిగాడు.  పడవ వాడు అయ్యా అవేవీ నాకు తెలియదు, కానీ మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా,  నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అంటూ అడిగాడు.

ఏమోయి అన్ని తెలిసిన పండితుడిని నాకు తెలియని ప్రశ్న ఉంటుందా ?  ఉండనే ఉండదు అంటూ శిష్య పరమాణువుల వైపు చూసాడు. అవునవును మా గురువు గారికి తెలియనిది ఏది లేదు అంటూ చెప్పారు.

ఇంతకీ నీ ప్రశ్న ఏమిటయ్యా అంటూ అడిగాడు పండితుడు అయ్యా మీకు ఈత వచ్చా అంటూ అడిగాడు పడవ వాడు. ఈత ఈత అంటూ నీళ్లు నమల సాగాడు పండితుడు.

అప్పుడు ఆ పడవ వాడు అయ్యా నాకు పురాణాలు,వేదాలు, పద్యాలు తెలియక పోవచ్చు కానీ పడవ మునగ పోతుంది నన్ను నేను కాపుడుకొనే తెలివి మాత్రం ఉంది. ఇక మీ బాధ మీరు పడండి.

వేదాలు పురాణాలు ఒక్కటే కాదయ్యా ప్రమాదం వచ్చినప్పుడు ఎలా బయట పడలో కూడా తెలిసీ ఉండాలి. అంటూ అతను పడవ నుండి దూకేసాడు.

ఇక శిష్యులు పండితుడి పై పడ్డారు అతనికి కోపం వచ్చేలా మాట్లాడారు. ఇప్పుడు మమల్ని కాపాడేది ఎవరు. మీకు పురాణాలు వస్తాయా, పుస్తకాల్లో చూసి బట్టి పట్టి చెప్తారు. 

ఆ మాత్రం మాకు తెలియదా, ఇప్పుడు మమల్ని కాపాడండి అంటూ పండితుడు నీ కొట్టినంత పని చేశారు.

అరె నాకు ఈత రానప్పుడు మిమల్ని నేనెలా కాపాడతాను అంటూ పండితుడు నెత్తి నోరు బాదుకుంటూ, అయ్యో నా చావు నీళ్లలో పోబోతుందా, అనుకుంటూ ఏడవడం మొదలు పెట్టారు.

అతన్ని చూసి శిష్యులు కూడా ఏడవడం మొదలు పెట్టారు.వాళ్ళు అలా ఏడుస్తూ ఉండగా. నీళ్లలోకి దూకిన పడవ వాడు వెళ్లి తన మిత్రులను తీసుకుని వచ్చాడు. ఆ పండితుడు తో పాటు అతని శిష్యులను కూడా కాపాడిన తర్వాత ..

అయ్యా నాకు చదువు రాదు, నాకు తెలిసింది పడవ నడపటం మాత్రమే, నేనొక పామరుడి నీ, ఎలా చేపలు పట్టాలి, ఎలా బ్రతకాలి ,

నది లో అలలు వస్తె ఎలా నన్ను నేను కాపాడు కోవాలి అనేదే నాకు తెలుసు అనగానే పండితుడు అతని కాళ్ళ పై పడిపోయి ఇన్నాళ్లు నాకు తెలిసిందే వేదం అనుకున్నాను.

ఇప్పుడే తెలిసింది నాకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని. ఇక ఇప్పటి నుండి పండితుడి అవతారం చాలించి తెలియనివి తెలుసుకుంటాను అన్నాడు.

శిష్యులు కూడా అవును మేము తెలుసుకుంటాం అన్నారు. పడవ వాడు వారిని వారి గమ్య స్థానాలకు పంపాడు.

కాబట్టి  అన్ని మనకే తెలుసు అనే అహంకారం వీడి చిన్న పిల్లాడి దగ్గర నుండి కూడా నేర్చుకునేవి చాలా ఉంటాయి అని గ్రహిస్తే మంచిది.

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *