పస్తులుండె
ఆగకుండ పడుతుండె వాన..
వేడి వేడిగ కోరుతుండె జిహ్వ లోన..
ఆ పూటకు తిండికి లేక పస్తులుండె..
జనాలు ఈ లోకాన..
నిరాశ నిస్ర్పహలతో బతికే ప్రాణులెన్నో..
జగాన..
వాళ్ల ఆశలపై నీళ్లు జల్లు ఈ వాన..
అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి..
బ్రతుకులాయే పేదవాడి పాలిట..
జడివాన ముసురుతో…
ఆగకుండా వరదలాయె ప్రతి ఇంటి..
వాకిట..
వాన వరదలతో వాగులన్ని ..
నిండిపోయి ప్రాణాలే వణికిపోయె..
జీవరాశులెన్నో నీట మునిగి..
తేలుటాయె..
ప్రాణాలే పోతుండె..
జనమంతా భీతిల్లే!
ఎప్పుడాగి పోతుందో!
ఆగకుండా కురిసే ఈ వాన!!
-ఉమాదేవి ఎర్రం
కవిత బాగుంది.
చాలా బాగుంది..