పర్యావరణం
ప్రాచీన కాలం నుండి అడవులలోకి వెళ్ళి నివసించటం అంటే కష్టసాధ్యమైనదిగా ఉంది.
అందుకేనేమో రామాయణ కాలంలో కైకేయి దశరధుడితో చెప్పి శ్రీరాముణ్ణి అడవులకు పంపుతుంది.
అలాగే పాండవులు కూడా మాయా జూదంలో ఓడి అరణ్యవాసం చేసారు.
అడవిలో కౄర మృగాలు,విష సర్పాలు ఉంటాయి.
రోడ్డు సౌకర్యం ఉండేది కాదేమో. తినటానికి తిండి, తాగటానికి నీరు కూడా సమయానికి దొరికేవి కావు.
అందుకే అడవిలోకి వెళ్ళిన వారు తిరిగిరావటం కష్టం అవటం వల్ల ఇలా అరణ్యవాసం ఒక శిక్షగా ఉండేది.
అందుకే పూర్వం కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అని పూర్వీకులు అనేవారు.
ఆ రోజుల్లో కాశీకి వెళ్ళాలంటే అడవులగుండా వెళ్ళాల్సి వచ్చేది.
ఏమైనా, అడవులను కాపాడుకుంటే పర్యావరణం బాగుంటుంది.
– వెంకట భాను ప్రసాద్