పరుగులే నా నడకలు

పరుగులే నా నడకలు

నా పరుగు లాయే 

నిత్య నడకలు.
నిన్ను చేరగా
నదే గమ్యం మాయే.

ఈ భౌతిక, మానసిక పరుగు
నన్ను మన్నించమని
అడుగుట కై సఖి!

నీ పైన నా తీక్షణ చూపులు
మరలించెను నీవి
గగనము వైపు.

నా ప్రేమ బిందువులు
కురిపించగ..
ఛత్రి మాటున దాచితివి
నీ శిరమును.

నా బాధ కన్నీరై కార,
వర్షము దానిని తడుపు చుండెను.

కాలం కలిసి రాలేదు లే!
ఈ పరుగు నే ఆ పనులే  !

 

– వాసు

0 Replies to “పరుగులే నా నడకలు”

  1. Adhbutham ga rasaru vasu garu. Mannimchu mane hrudayaniki badha entha untundho chala chakkaga chepparu. Na kallu kanneti bashpalatho nindipoyayi.

    Sruthi

  2. వాసు గారు మీరు యీ కవిత చాలా బాగా రాసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *