పరిమళం
ఈ వసంత కాలంలో
కొన్ని చెట్లు చిగిరిస్తే
మరికొన్ని వాడిపోతాయి.
మనమెంత జాగ్రత్తగా
చూసుకున్నా, నీరు పోసినా
అవి వాడుతూనే ఉంటాయి.
ఈ చెట్ల లాగే కొందరు మనుషులు కూడా
మనమెంత దగ్గరికి వెళ్ళాలని చూసినా
ఏన్ని విధాలా చెప్పినా మాట వినరు
మార్చాలని చూస్తే మన పైనే నిందలు వేస్తారు .
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
ఆ చెట్టును చూశారా ఆకులు, లేకున్నా
చెట్టంత పువ్వులతో నిండి పోయింది.
మనమూ అంతే ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూస్తూ కూర్చోకుండా మనకు మనమే
ధైర్యం చెప్పుకుని ,మన మనుషులను మనమే
మార్చుకుని, అందమైన పువ్వుల మాలా లాగా
పరిమళలిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాలి.
-భవ్య చారు