పరీక్షల హడావుడి
ఈ సారి గ్రూప్ 4 పరీక్షలకు మాస్కూల్లో సెంటర్ పడింది.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కొన్నివందల ఉద్యోగాల కోసం లక్షల
మంది పరీక్షలు వ్రాసారు.నాకుఇన్విజిలేటర్ డ్యూటీ వేసారు.
మా స్కూల్లో పరీక్షలు వ్రాసినవారిలో ఒక అంధురాలు కూడాఉంది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా వచ్చింది. ఆమె
స్వయంగా వ్రాయలేదు కాబట్టివేరే వ్యక్తి సహాయంతో ఆమె ఆపరీక్ష వ్రాసింది. కొంత మందిదివ్యాంగులు కూడా ఆ పరీక్ష
వ్రాసారు.
వారికి అందరి కంటే కొంత ఎక్కువ సమయం ఇవ్వబడుతుంది. ఈ పరీక్షలు వ్రాసిన వాళ్ళంతా కొన్ని ఏళ్ళనుంచి ఆ పరీక్షల కోసం చదివారు. కొందరుకోచింగ్ తీసుకుంటే మరికొందరు స్వంతంగా చదవి
పరీక్షలు వ్రాసారు.
ఉదయంపది గంటలలోపే పరీక్ష వ్రాసేవారు పరీక్ష హాలులోకివచ్చేసారు. ఆ రోజుఅభ్యర్థులు రెండు పరీక్షలువ్రాసారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పరీక్షలుఉంటాయి.
హైదరాబాద్నగరంలో ఎన్నో పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. ఆపరీక్షలు వ్రాసిన వారిలోచాలా మంది ప్రభుత్వ,ప్రైవేటు రంగాల్లో పనిచేసేఉద్యోగులు కూడా ఉన్నారు.
ఏదిఏమైనా ప్రభుత్వం ఈ సారిచిత్తశుద్ధితో పరీక్షలు నిర్వహించింది. విద్యార్థులుకూడా ఉత్సాహంగా పరీక్షలు వ్రాసారు. పరీక్షలు వ్రాసినవారందరికీ ఉద్యోగాలువస్తాయని చెప్పలేముకానీ వస్తాయనే ఆశతోనేఅందరూ ఉన్నారు.
ఈసారి మాత్రం ఉద్యోగాలు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉన్నారు.పరీక్షలు నిర్వహించటమేకాకుండా అభ్యర్థుల ఎన్నికకూడా సక్రమంగా జరగాలిఅనేది అభ్యర్థుల కోరిక.
-వెంకట భానుప్రసాద్ చలసాని