పరమార్థం
చిరునవ్వు
మెరిసే తెల్లని ముత్యమై
ఆనందం
ఆకుపచ్చని వసంతమై
ఉత్సాహం
ఉప్పొంగే నీలి కెరటమై
ఉల్లాసం
పసుపు వర్ణ పతంగమై
కేరింత
అరుణారుణ కిరణమై
సంతోషం
విరిసే ఇంద్ర ధనుస్సై
హోళీ కేళిలో
ఈర్ష్యా ద్వేషాలు ధ్వంసమై
విశ్వానందం చిందులేయాలి
వసుధైక కుటుంబమై
అందెల రవళి
వినిపించాలి….
– దేవా