పండుగ పరేషన్
పండగంటె సుఖశాంతులతో వెళ్లివిరిసే జీవితాలు, ఆనందాలతో చిందులేస్తూ ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు కొత్త బట్టల కోలాహలం, కమ్మటి పిండివంటల అప్పాలు, అరిసెలు, గారెలు, బూరెలు, బొబ్బట్లు, గర్జలు, చక్రాలు, చెకోడీలు. ఇంకా నోరుని తీపి చేసే తీయటి స్వీట్ పాయసాలు, పానీయాలు, మసాలా వాసనతో నోరూరించే గుమగుమలాంటి చికెన్ మటన్ బిర్యానీతో కనువిందు చేసే విందులు వినోదాలు.
వేదామృతలతో మొదలుకుంటే గుడుంబా, గుల్పారం, సోడా సీసాలు, శీతల పానీయాలు, బెల్టు వైన్ షాప్ లో దొరికే ఎర్రమందు కళ్ళు నుండి అత్యధిక ఖరీదు పలికే కాంచి సీసా వరకు, బిడి, సిగరెట్ గుట్కా, పాన్ పరాక్, ఆకులిడం వరకు తక్కువలో తక్కువ ఎంతో కొంత ఖర్చు చేయాల్సిందే.
అవును మరి పండగలు అంటే అందరికీ మరి…
రెక్క ఆడితే గానీ డొక్కాడని కటిక దరిద్రపు పేదలు ఉన్నారు ఈ దేశంలో, ఆకలితో అలమటించి పేగులు ఎండు కట్టుకపోయి దిక్కు తోచని పరిస్థితులో నిర్రనీలుగుతూ చతికిలపడిపోయి చచ్చిపోయిన బడుగు జీవులెన్నో అసలు సంఖ్యకు కూడా రావేమో.
ఎవరు లేని అనాధలు ఈ దేశంలో రోడ్లమీద పడి అడుక్కుతింటూ ఉంటే, మనం బాగుంటే చాలు మన బతుకులు బాగుంటే చాలు అని మనం పండగలు చేసుకోవాల్సిందే. అవును మరి పండుగలు అంటే అందరికీ..
మధ్యతరగతి కుటుంబాలు ఇంకా అధమస్థాయి కుటుంబాల గురించి చెప్పాలంటే ఇంకా గుండెల గుబెలు కావాల్సిందే అప్పులు చేసి మరి పండుగలు చేయాల్సిందే
అల్లుడు ఇంటికి వస్తే అడక్కుండానే అన్ని సమకూర్చాలి అత్త మామ ఆడబిడ్డలకు ఏమైనా తక్కువ పడితే ఏం జరుగుతుందని చేతులు పిస్కుంటూ మాటలు తడబడవలసిందే. ఇంకా ఎదురింటివారు, పొరుగింటివారు పక్కింటివారు వారికి ఏమాత్రం తగ్గిపోకుండా వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి మరి పండగలు చేయాల్సిందే.
అవును మరి పండుగ అంటే అందరికీ మరి…
మీకు ఒక సంఘటన చెబుతాను మా ఊరి దగ్గర ఉన్న ప్రాంతంలో ఒక సాధారణమైన మధ్యతరగతి చిన్న కుటుంబం నివసిస్తూ ఉన్నారు, అయితే ఆరోజు పండగ రోజు కాబట్టి ఇంట్లో చాలా అడవిడిగా ఉండేది తండ్రి ట్రాక్టర్ డ్రైవర్, తల్లి బీడీ వర్కర్ వారికి ఇద్దరు పిల్లలు పండగ రోజు కాబట్టి ఇంట్లో ఉన్న వాహనాలకి కొందరు పూజ చేసుకునే సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటారు.
కాబట్టి దానిని కడగడానికి దగ్గరలో ఉన్న వాగు వద్దకు బయలుదేరారు అతనితో పాటు అతని పిల్లలు కూడా వెంటపడితే తీసుకెళ్లారు ఆ వాహనాన్ని శుభ్రంగా కడిగి పిల్లలకు అక్కడనే స్నానాలు చేయించి తను స్నానం చేసి అదే ట్రాక్టర్ పై ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుండగా అనుకోకుండా ఒక పిల్లవాడు జారి పడిపోయి ట్రాక్టర్ టైర్ కింద నుజ్జు నుజ్జు అయిపోయాడు.
వెంటనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అలా క్షణాల్లో జరిగిన సంఘటనను చూసి ఆ కుటుంబ సభ్యులు బాధతో రోదిస్తూ గుండెలు బాదుకుంటూ ఏడవడం జరిగింది. పండగ పూట పెద్ద విషాద ఛాయలు అలుమూకున్నాయి ఆ ప్రాంతమంతా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు అక్కడక్కడ ఈ పండగ సమయాల్లో జరుగుతూనే ఉన్నాయి ఈ పండుగలు కొందరికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తే మరికొందరి కుటుంబాల్లో దుఃఖాన్ని మిగులుస్తున్నాయి కొందరేమో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలవుతున్నారు.
మరొక సంఘటన ఏంటంటే, పోరుగుఊరిలో పెద్దమ్మ పండుగ జరుగుతుందంటే చుట్టాలు పిలిచారని బైక్ వేసుకుని వెళ్ళాడు ఒక మిత్రుడు. మద్యం మాంసం ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు, ఇతను మద్యం ఎక్కువ తీసుకొని రాత్రి ఇంటికి ప్రయాణం చేశాడు మార్గమధ్యంలో మద్యం మత్తులో బండిని అతివేగంతో నడుపుతూ అదుపుతప్పి చెట్టు గుద్దుకొని తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అడిగిందానికి కొనిచ్చారు చివరికి కొడుకు చనిపోయిన వార్త విని గుండెలు పగిలేలా ఏడ్చారు పండగ వాతావరణం లో ఇలాంటి సంఘటనలు జరిగి ఎందరో వ్యక్తులను కోల్పోవడం జరిగింది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశమంతా చాలా సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి పండుగ పేరు చెప్పి అక్కడక్కడ మూకుమ్మడి దారుడు, కులం మతం పేరిట కొట్లాటలు, వెలివేతలు, అక్కడక్కడ మనుషులకు జరిగే కొన్ని అవమానియా సంఘటనలు, కొందరిని అవమానపరచడం, కొన్ని గ్రామాలలో ఊరంతా పండుగని బోనాలు ఎత్తుకొని పోతుంటే తక్కువ కులాల బోనాలు దేవునికి నైవేద్యంగా పెట్టవద్దని అడ్డుపడడం దానితో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు కావడం ఇలాంటి సంఘటనల ద్వారా ఆ గ్రామాలలో పండుగ వాతావరణం లేకుండా పోవడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం లాంటివి అనేకం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
పండుగలు పబ్బాల పేరుతో మనుషుల్లో మూఢనమ్మకాలు జోపిస్తు భక్తి ముసుగులో మనిషికి భయన్ని అంటకడుతూ ఎవరో చేసే ఎత్తుగడలకు తెలియని వారి చేతుల్లో కీలుబొమ్మలవుతాం, ఊహలు నమ్మకాల ఉచ్చులో పడి ఉన్న జీవితాన్ని అప్పుల్లో కూరుకుపోయి మనసు ప్రశాంతత లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో ఆపదలతో ఇరికాటంలో పడి ఇబ్బందులకు గురవుతూ ఉంటాం, ప్రశాంతంగా ఉన్న జీవితాలను ఆందోళనకరంగా మార్చుకుని శారీరక మానసిక రుగ్మతలు మనకు మనమే ఏర్పరచుకుంటాము
మనిషి మానసిక పరిపక్వత చెందాలి, మానసిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలి, చైతన్యంగా ఆలోచించగలగాలి, సమాజ హితం కోరి మెలగాలి, హెచ్చుతగ్గులు లేకుండా ఒకరు ఒకరు అర్థం చేసుకోగలలిగా, ఆర్థిక అసమానతులకు మూలాలు వెతకాలి, ఈ దేశ రాజకీయ వ్యవస్థల్లో మార్పులు రావాలని మన ప్రయత్నాలు చేయాలి, డబ్బు ఆస్తి అంతస్తుల వ్యామోహం విడనాడాలి, అందరూ సమానంగా బతకాలని కోరుకోవాలి అప్పుడే కదా అందరికీ పండగ అయినా పబ్బమైనా కలిసి జరుపుకునే పసందు.
– బొమ్మెన రాజ్ కుమార్