పండు వెన్నెల

పండు వెన్నెల

పండు వెన్నెల లాంటిది ఆడపిల్ల అందం అంటారు

వెన్నలను వర్ణించడానికి పదాలు సరిపోవు కాని
పండువెన్నల ను చూడాలన్నా పాత రోజుల
పల్లెటూళ్ళ కు వెళ్లాల్సిందే
పల్లెటూరి అందాలల్
పున్నమి జాబిలి చెప్పాల్సిందే . ఇప్పటి విద్యుత్ కాంతుల
వెలుగులు లేవు కాని
గుడ్డు దీపాల వెలుతరు
వెన్నలరోజులకోసం ఎదురు చూపులు దీపాలలో నూనె
పోయకున్న చిమ్మెలు తుడవక పోయినా వెన్నెల
రోజుల్లో పనిలేదు
అందులోనూ ఎండాకాలంలో చల్లదనం
కోసం ఆరుబయటే అన్ని పనులు నిజంగా చెప్పాలంటే ఆ రోజులు
అనుభవిస్తే గాని తెలియదు
దాని తియ్య ధనం .
పసి ప్రాయపు ఆటలు మనసుకు హత్తకునేలా
కల్మషం లేని మనుషులు
చెంత చేరే జీవరాసులు
పశు పక్ష్యాదులు మూగ
జీవాలు ఎండాకాలం
ప్రతికొమ్మ ఆకురాల్చి పూత
సంతరించు కొని ఆహ్లాదాన్ని
పంచుతాయి ఆ అందాలు
అనుబంధాలు వేరే రోజులు

కరెంటు లేని రోజులు పండు వెన్నల కోసం
నెలవంక వచ్చిన రోజు నుండి
ఎదురుచూపు విసన కర్రలు
తొక్కుడు బిళ్ల ఆటలు బావిలో నీళ్ళు మజ్జిగ
చల్లదనం పల్లె తల్లి పోత్హిల్ల లో ఒదిగిన సిరివెన్నెల జల్లులు.

ప్రకృతి ప్రతి మాసంలో
మనకు ఇచ్చిన విడిది

పండు వెన్నెల్లో పూల
బంతి లాంటి చంద్రున్ని
చూస్తూ నక్షత్రాలను లెక్కిస్తూ
చందమామలో ముసలమ్మ
నీ చెట్టును వుంటాయి అంటే నిజమని నమ్మి
ఆటపాటల్లో మునిగే వాళ్ళం
చెరువు లోని కలువలు
నేనున్నాయని చెబితే
అప్పుడప్పు డు చూసి
గుడ్డి దీపాల వెలుగులో
పెరుగన్నం తిని ఆరుబైటే
మంచాలు కంచాలు మరి

గొడకున్న సన్నజాజి తీగ
వేకువజామున నా వాసన చూడుమని అంటే నీడని
చూసి టైమ్ తెలుసుకుని
ముసుగు తీసి మళ్ళీ మొదలు పక్షుల కిలకిలా
రావాలు ఉదయపు కాంతులు అంతే .

మనకాలపు ప్రత్యక్షఅనుభవాలు
ముందు తరాల వారికి
అందాల అంశాలు .

– జి. జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *