పండుగ ఆనందం

పండుగ ఆనందం

అందమైన ఉగాది పండుగ
తెలుగునాట శ్రేష్టమైన పండుగ
స్పష్టమైన నూతన సంవత్సర పండుగ
షడ్రుచులు మేళవించే పండుగ
జీవిత అనుభవాలను తెలిపే పండుగ

ముచ్చటైన అలంకరణ..
శుభకృత్ నామకరణ
సాంప్రదాయాల అనుకరణ..

తొలి పండుగ గా గడించావు కీర్తి
సకల పండుగలకిచ్చేవు స్వాగత హారతి
పెంపొందించేవు తెలుగు సంస్కృతి
మైకులలో పంచాంగాల ఉధృతి
విన్న మనసుకు చేకూరును ప్రశాంతి
ఆపై మానవాళికి కలుగును మనశ్శాంతి..

 కిరీటి పుత్ర రామకూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *