పలుకు గొప్పతనం
లక్ష్మి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అనీ స్వప్న అడుగుతుంది లక్ష్మి నీ..ఏం లేదు స్వప్న అసలు మనషులలో ఇన్ని తేడాలు ఎందుకు…
కొంత మంది అయితే మేము పేదవాళ్ళము అనీ బాధ పడుతూంటారు అసలు బాధ దేనికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు చేతఅయినా పనీ చేసుకుంటూ ఉన్నంతలో ఒకరి దగ్గర అరువులు చాచకుండా ఉంటే సరిపోతుంది కదా.. తన స్థానం ఏరిగి మసులుకుంటే సరిపోతుంది కదా తనకు తానే రాజు అవుతాడు కదా…
ఇక పేద వాడు అనే ఆలోచనే రాదు.. ఇక వృద్ధులనే తీసుకో అసలు ఎందుకు ఒకరిని బిచ్చం అడగాలి.. జీవితం అంతా కష్టపడి మలివయసులో వాళ్ళకు ఈ దౌర్భాగ్యం అవసరమా..
అసలు ఏమి చెప్పాలి అనుకుంటునావు లక్ష్మి నువ్వు సూటిగా స్పష్టంగా చెప్పు..
ఇందులో చెప్పడానికి ఏం ఉంది స్వప్న ఎపుడో పొద్దున్న అనగా ఇంటిఆయన బయటి వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకొని అలిసి ఇంటికి వస్తే తలకు మించిన అప్పులతో సతమాతమవుతూ కంటికి సరైన నిద్ర లేక మనఃశాంతి లేని జీవితాలు నుండి బయట పడే మార్గం ఇంటి గృహలక్ష్మి చేతిలో లేదంటావా స్వప్న.. మనసు ఉంటే మార్గం లేదంటావా..
అలా ఎలా లక్ష్మి అంతా చదువుకున్న వాళ్ళే ఉంటారా చెప్పు..స్వప్న చదువు బతకడానికి అవసరం కానీ చదువు ఒక్కటే కాదు బ్రతుకు బండినీ నడపాలి అంటే మార్గాలు అనేకం..
వంట మాత్రమే వచ్చే ఆడవాళ్లు ఏం చేస్తారు లక్ష్మి సరైన ఆలోచన పెడితే ఆ వంటే ఆయుధంగా చేసుకొని పేదరికం నుండి బయటపడొచ్చు.. ఏదన్నా మన ఆలోచన తిరులోనే ఉంటుంది స్వప్న…
సరే మరీ బయట బెగ్గర్స్ వాళ్ళకు హెల్ప్ చేయటం సభమే కదా..అయ్యో స్వప్న మనము వంద రూపాయలు ఇచ్చిన…వెయ్యి రూపాయలు ఇచ్చిన మరసటి రోజు ఆ వ్యక్తి అడుక్కొకమానడు తన దారి మార్చడు కదా…మనము ఎంత హెల్ప్ చేసిన తృప్తి ఉండదు కదా..
సరే మరీ వారికీ నీవూ చెప్పే మార్గం ఏంటి మరీ..
బెగ్గర్స్ అందరికీ ఓ చోట ఆశ్రమం కల్పించి వారికీ చేత అయినా పనీ వాళ్ళు సంతోషంగా చేయగలిగిన పనీ చేస్తే సరిపోతుంది కదా..
పిచ్చి గానీ పట్టిందా వయసు మళ్ళిన వాళ్ళు ఏం పనులు చేస్తారే నీ పిచ్చి కాకపోతే..
చిన్న చిన్న మొక్కలు.. పూల దండలు అల్లటం వగైరా పనులు ఇష్టంగా చేసుకుంటూ ఒకరిని దేహి అనీ అడగకుండా ఉండగలిగితే సరిపోతుంది కదా..
ఇక సాయం చేయాలి అనుకొనే వారికీ ఆన్లైన్ లో సేవ ట్రస్ట్ అందుబాటులో పెట్టి వాళ్ళకు తోచిన సాయం చేయగలితే సరిపోతుంది కదా..
అనాధ శరణాలయాలు పిల్లలకు విలువలతో కూడిన విద్య అలాగే సాయం చేసే గుణం చిన్న తనం నుండి మనము నేర్పించడం వాళ్ళ రాబోవు తరం మారుతుంది కదా నేటి అనాధపిల్లలే ఒక ట్రస్ట్ గా ఏర్పడి తమ సంపాదనలో కొంత కేటాయించడం వల్ల సమాజానికి ఎంతో మేలు చెయ్యొచ్చు కదా.. ప్రతి పాఠశాలలో చదువుతో పాటు సేవ గుణం కూడా నేర్పిస్తే మారని సమాజం ఉండదు అంటావా స్వప్న…
నీ ఆలోచన బాగుంది కానీ ఇది సాధ్యమయ్యే పనేనా చెప్పు మారని వాటికీ ఆలోచనలు అవసరమా లక్ష్మి..
ఎందుకు అవ్వదు స్వప్న ప్రమిద చిన్నదే కానీ కొన్ని వేల ప్రమీదలు కలిస్తే మహా జ్యోతి అవుతుంది..
సరే మరీ నీ ఆలోచనలో నేనూ ఒక చిన్న ప్రమీదనై ఉంటాను అనీ స్వప్న లక్ష్మి కూ నవ్వుతూ చెపుతుంది…
-కళ