పలుకే బంగారమాయె
చర వాణి కాసేపు నువు
మూగవోతే నేనెట్లా
ఉండగలను చెప్పవే
అరచేతి ప్రపంచానివి నీవు
అందరికీ నేస్తమైన నీవు
నా ఆత్రుత ఆలకించవే
బంగారపు పలుకు పలుకవే
ఏం చేసినా నా చూపు నీ వైపే
ఏం చోద్యమో గానీ
అరచేతి అందమా మరి
ఆ క్షణికపు ఆవేదన మరి
ప్రత్యక్ష నిదర్శనం అది
పరోక్ష అంతరార్థం అది
కమ్మని పాటవై
కనిపించని స్నేహ మై
పసిపాపల లాలివై
వినోదపు సొంపువై
తెరతేసిన చైతన్యమే
లోకాల లోగిళ్లలో
వరమిచ్చి న నీవే
బంగారపు పలుకైతే
ఉలికించి పలికించనా
చరవాణి పలకవే
ఆదరిస్తున్న నా కోసం
అందుకే మరి నిన్నూ …..
– జి జయ