పాలమూరుముద్దుబిడ్డ ప్రతాపరెడ్డి
సురవరం మనవరం
సురవరం మనతేజం
సురవరం మనరత్నం
సురవరం మనగర్వం
ప్రతాపరెడ్డి పండితుడు
ప్రతాపరెడ్డి పరిశోధకుడు
ప్రతాపరెడ్డి పాత్రికేయుడు
ప్రతాపరెడ్డి పత్రికాస్థాపకుడు
పుట్టాడు
పాలమూరు బోరవెల్లిలో
మెరిసాడు
తెలంగాణా భాగ్యనగరంలో
చదివాడు
కర్నూలులో ప్రాధమికవిద్యను
చేశాడు
హైదరాబాదులో ఎఫ్ ఎ చదువు
అయ్యాడు
మద్రాసులో పట్టభద్రుదు
పూర్తిచేశాదు
అక్కడే న్యాయవిద్యను
చలించాడు
తెలంగాణా దుస్థితికి
కలతపడ్డాడు
తెలుగుభాష అగౌరవానికి
పెట్టాడు
తెలుగులో గోల్కొండపత్రికను
వ్రాశాడు
వివిధపత్రికలలో వ్యాసాలు
తెచ్చాడు
తెలంగాణా కవులసంచికను
ప్రచురించాడు
ఆంధ్రుల సాంఘీకచరిత్రను
తపించాడు
తెలుగుభాషకు
మద్ధతిచ్చాడు
విశాలాంధ్రకు
వ్రాశాడువ్యాసాలు
కూర్చాడు కవితలు
రాశాడు నవలలు
రచించాడు కథలు
ధిక్కరించాడు
నైజాం నిరంకుశత్వామును
ఎదిరించాడు
భూస్వామ్యవ్యవస్థను
వ్రాశాడు
పెక్కుపుస్తకాలను
తెలిపాడు
ఆంధ్రులచరిత్రను
సురవరం శౌర్యానికి
శతకోటివందనాలు
ప్రతాపరెడ్డి ప్రతాపానికి
పలుపుష్పాంజలుల
అందరికీ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు.
-గురువర్ధన్ రెడ్డి