పాల వెన్నెల్లో
పాల వెన్నెల్లో…
నీ ఒడిలో సేద తీరుతుంటె..
ఎంత హాయిగా ఉండేదమ్మా..
ఆ వెన్నెల్లో నీ గోరు ముద్దలు..
తింటుంటే ఎంత మధురంగా ఉండేదో..
అందరినీ కూచోపెట్టుకుని..
కలిపిన నీ పప్పు ఆవకాయ నెయ్యన్నం..
మా చేతుల్లో పెడుతుంటే..
ఇంకా ఇంకా అంటూ మేం అల్లరల్లరిగా తినే ఆ అనుభూతి..
అధ్బుతం కదమ్మా!
ఇప్పుడు ఆ పాల వెన్నెల అలాగే ఉంది..
ఆ అన్నాలు పప్పులు పచ్చళ్లు ఉన్నాయి..
కానీ..
నువ్వు లేవు ఆ కమ్మదనం లేదు..
ఆ ప్రేమా ఆప్యాయతలు లేవు..
ఆ పాల వెన్నెలను ఎన్ని సార్లు అడిగానో!
మా అమ్మ ఏదని? ఎక్కడ ఉందని?
నువ్వు లేవు రావని తెలిసినా!
ఏదో ఆశ నా కోసం వస్తావేమెానని..
అమ్మా! నాకలలోనైనా ఒకసారి కనిపించవా?
తనివి తీరా చూసుకుంటాను!!
-ఉమాదేవి ఎర్రం