పక్షపాతం
పక్షపాతం ఒక పక్షవాతం!!
పక్షపాతం,
నీ బుద్ధికి సోకిన
పక్షవాతం!!
నీకు నచ్చిన చాలు,
మురుగు నీటి ధార,
కాన వచ్చు
అమృత ధారవలే!!
నీకు నచ్చిన చాలు,
పొరుగోరి చుట్ట పొగ,
ఎగ పీల్చుటకు ,
సుగంధ ధూపంబగు !!
నీకు నచ్చని ఎడల,
చుట్ట పోని
చుట్టపొగ
నీకు ఉబ్బరంబగు.
మరి కాదౌదే,
అది నాకు అబ్బురంబు!!
– వాసు