పగలే వెన్నల
నాఊహలకే కన్నులుంటే
చూస్తూ మాట్లాడుతుంటే
నామనస్సు కనిపించింది
“పగలే వెన్నలని”.
వెన్నెలో చెలితో ఉంటే ఎంత హాయి అని……
తన వాలుచూపుల తమకంలో ఏం మత్తు ఉందో….
నా గుండెల్లో అలా కదలాడుతుంది….
తన చిరునవ్వుల గలగలలో ఏ పరిమళం దాగుందో…..
తొలకరి చినుకల్లే నను నిలువెల్లా తడుపుతుంది….
ఎదో మత్తులో నింపుతుంది….
తన చిలకపలుకులలో ఏం మంత్రం ఉందో…..
తన నల్లటి కురులు
నామోమును తాకి
మత్తెక్కించినట్లని పింస్తూంది….
తన మెడ మలుపులు
నను నిలువనీయనన్నవి…
తన యదపొంగులు
నాకళ్ళార్పనీయలేదు….
తన దరిచేరి చుంబించమన్నవి….
తన జతచేరి నా మది ఆదమరచి ఆమె వడిలో నిదుర పోతానంటుంది….
ఆమ సొగసైన హొయలు,
వంపు సొంపులు….
వరాల వెండిపూల వానలో నను అభిషేకిస్తుంటే
తన కాటుక కనుల వాకిలిలో ముగ్గులేసుకొనే నా ఊహలు….
అందమైన సుందర తీరాలలో నన్ను తిప్పుతుంటే….
ఇంకా ఏం వెతుకుతుందో నా మనసు తనతో చెప్పలేక పోతున్నా….
ఆమెతో ఏదో చెప్పాలని తడబడుతూ మాట్లాడాను
కానీ చెప్పలేక పోయాను….
తను అడిగినా మాటలు రాలేదు….
ఆమె మోము చూడగానే….
ఈరోజు నిజంగా
తన ప్రేమ నందనవనంలో
స్వర్గపు పూదారిలో
నా ఎద పరుచుకుంది సుతిమెత్తగా….
నాహృదయలోగిలికి తనని ఆహ్వానిస్తూ….
నా ప్రేమతో ఆమెను అభిషేకిస్తూ…..
అలా అలా విహరిస్తూ….
ఏమిటో అలా ఉండిపోయా….
ఆమెనాపక్కనుంటే
“పగలే వెన్నెల” అనిపిస్తుంది.
రేయి పగలకు తేడా తెలియదని పిస్తుందు.
ఊహకే ఇంత ఆనందం ఉంటే
ఇదే నిజమైతే నా జీవితం
స్వర్గం కాదా …….!
– విశ్వనాథ్. నల్లి