పడవ ప్రయాణం
ఒంటరితనం ఒక శాపం.
కలసి ఉంటే కలదు సుఖం.
జీవితం ఒక పడవ ప్రయాణం.
కలసి పయనిస్తే బాగుంటుంది.
ఒంటరి పయనం ఇబ్బందికరం.
సంసారం సాగరం దాటాలంటే
జంటగా కలసి బయల్దేరాలి.
ఒంటిగా బైలెల్లితే చిక్కులే.
కష్టాల కడలిని దాటాలంటే
సహచరి అండ కావాల్సిందే.
ఒంటిగా ప్రయాణం మానుకో.
జంటగా ముందుకు సాగిపో.
ఆటుపోట్లు నీకు అడ్డంకి కాదు.
ఒకరికొకరు తోడుగా సాగిపో.
ప్రేమగా జీవితాన్ని గడిపేయ్
-వెంకట భానుప్రసాద్ చలసాని