పాదాలు
నిజం గా అంత అందముందా..ఆడవాళ్ళ పాదాలలో…
ఒక కవి అనేవాడు…ఇలా…
ఎందుకో ఇప్పుడనిపిస్తుంది అంత అందముందా ఆడవాళ్ళ పాదాలల్లో
అన్వేషిస్తు ఉంటాయి నా కళ్ళు అవకాశం చిక్కినప్పుడల్లా…
పడతి..చింగులు పైకి చెక్కి…పని చేస్తున్నంత సేపు…
పసుపు రాసే కార్యాలలో… పసుపు రాసుకున్న పాదాలని..
పరిగెత్తే పాదాలని..
పవళించిన పాదాలని..
పట్టీలు వేసుకున్న పాదాలని..
అతని వెనక ఏడడుగులు వేసిన ఆమె పాదాలని
సిగ్గు గా నడక భారమయిన పాదాలని..
కోరిక నేలకి రాసి చూపే పాదాలని..
కోరిక తో వచ్చిన మొగుడు కొసరి కొసరి ముద్దాడే పాదాలని
పసిబిడ్డని కాళ్ళ ఫై వేసుకొని స్నానం పోసే అమ్మ పాదాలని…
అలిగితే భగవంతుడి శరస్సునే తన్నిన (సత్యభామ) పాదాలని
కోపమైన పడతిని మన్నించమంటూ మగాడి ఆహాన్నిదాటిన చెయ్యి తాకిన ఆమె పాదాలని
అవమానాలు ముళ్లయిన నడిచే ఆ పాదాలని
ఉద్యోగ బాధ్యతలు …కుటుంబ బాధ్యత తీసుకోవడం లో ముందుండే ఆమె పాదాలని
బతుకే సమస్య అయినపుడు..ఎదురీతలు ఎదకోతలు.. దాటిన ఆమె పాదాలు
వంటరి గా సమస్యల ఫై యుద్ధం చేస్తున్న ఆమె పాదాలని
భారమైన నడక చివరి దశలో ఆమె పాదాలని…
ఇంత నడక నడిచిన…అంత అందమైన ఆమె పాదాలు ఎవరో ఒకరి వెనకే నిలబడి ఉండటం… ఇంకా చూస్తూనే ఉన్న…అతనికి సాయం గా…
పసిదానిగా..
పడుచుపిల్ల గా
భార్య గా..
తల్లి గా ఆ పాదం…అడుగు వెనకే. ఉండిపోయింది..
ఇంకా ఎవరి చేతో నడపబడటం చూస్తూనే ఉన్న…
ఒక్క మగాడు అయినా….
ఇన్ని దశలలో ప్రతి మగాడి విజయం వెనక ఆడది అనే మాట దాటి…
నాతో సమానం గా నో…
నాకు ముందుగానో ..
నడవమనే మాట అంటాడేమో అని. చూస్తూనే ఉన్న. .ప్చ్…
నిజం కదా అందమైన పాదాలు…ఎంత బాగుంటాయో
అంత అందమైన పాదాలు..
వాటికీ అందమైన వెండి పట్టాలు…
వాటికీ సవ్వడుల గజ్జెలు…
సవ్వడులు సడి చేయగా…
చిదిమేసే ముళ్ళు దాటి…
చిన్న చిన్న అడుగులు దాటి పరవల్ల నడకలు…నేర్వు అందమా…
నిన్ను నువ్వు గుర్తించు..నిన్ను అంటుకున్న సంకెళ్లు దాటి…
ఆత్మవిశ్వాసం తో అడుగేసే పట్టిల సవ్వడుల అడతనమా…చాల అందంగా ఉంటాయి నీ పాదాలు…
-గురువర్ధన్ రెడ్డి