పాఠం

పాఠం

చెట్టు నీడలో బాటసారిలా సేదదీరితే
ఏకాంత పయనం వేడుకగా తోస్తుంది
శిశిరం నుంచి వసంతపయనమో అద్భుతమైన దృశ్యం

ఆకురాల్చటంతో చెట్టు తననితాను ప్రక్షాళించుకుంటుంది
కొత్తగా తొడిగిన చిగుళ్లతో తెగుళ్ళను దిగుళ్ళను
నేలకాహారం చేస్తుంది

కాలగమనంలో శిశిర వసంతాలు
మనకు అద్భుత పాఠాలు
పెనుగులాటగా మారిన
జీవితపు పరుగులో
ఆగి ఆస్వాదించమన్న
ప్రకృతి పాఠం వినటం నేర్చుకుంటే
అందరమిక బాటసారులమే

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *