పాత రోజులు

పాత రోజులు

“అనిత… నేను ఆఫీస్ కి వెళ్తున్నాను జాగ్రత్త” అని చెప్పాడు గోపి. అనిత కి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు.  పిల్లలకు ఫోన్ అలవాటు చేయకూడదు అనుకొని ఫోన్ అలవాటు చేసేసాను. ఏడ్చేటప్పుడు , తినేటప్పుడు ఆ బాబు ఫోన్ ఇచ్చేవారు.

ఒకరోజు అనిత టీవీలో పాత సినిమా చూస్తుండగా తన చిన్నతనంలో వాళ్ళ అమ్మ తన తమ్ముడికి వెన్నెల్లో పాలబువ్వ  తినిపిస్తూ ఎన్నో మాటలు చెప్పి అన్నం పెట్టెంది.  అందమైన వెన్నెల్లో చిన్నపిల్లలను ముచ్చట్లు పెట్టి అన్నం తినిపిస్తూ ఉంటే అది మాటల్లో వర్ణించలేని అనుభూతి.
అది గుర్తుకొచ్చిన అనితకి తన బాబుని చూసింది. వాళ్లు ఫోన్ ని చూస్తూనే తింటున్నారు. ఫోన్ తోనే ఆడుకుంటున్నారు.

చిన్నపిల్లలకి వెన్నెల్లో గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. ఇప్పుడున్న పిల్లలకి వాటి గురించి చెప్తే అవునా అని అంటారు గాని ఒక్కసారి కూడా మాకు వెన్నెల్లో తినాలి అని ఉంది అని ఎవ్వరూ చెప్పరు.
అలాంటివి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నందుకు బాధగా ఉంది. అది మన అమ్మ వాళ్లు మనకు అలవాటు చేసి మనం మన పిల్లలు అలవాటు చేయకుండా ఫోన్ అలవాటు చేసాము. అదే  మనం చేస్తున్న పొరపాటు.

అప్పటి ఇల్లు చాలా విశాలంగా ఉండేవి. పెరట్లో రాత్రి పూట మంచం వేసుకొని వెన్నెల వెలుగులో చంద్రడితో ఎన్నో కబుర్లు చెప్పుకొని నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు మాత్రం అపార్ట్మెంట్ ఇల్లు కావడం వల్ల ఆడుకోవడానికి పిల్లలకు ఆటలు ఆడటం తక్కువ అయ్యింది. పాత రోజులు మళ్ళీ వస్తే చాలా బాగుంటుంది. అనిత ఒక రోజు రాత్రి వెన్నెలను చూపించి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది.

పాత రోజులే చాలా విలువైనవి. వాటి గురించి మన పిల్లలకు చెప్పాలి అని అనుకుంది అనిత. మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండే మీ పిల్లలకు చెప్పండి.

– మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *