పాపం పసివాళ్ళు
పాపం పసివాళ్లు అనేదానికన్నా సమాజపు దుస్థితి అంటే బావుంటుంది
బాలకార్మిక వ్యవస్థను రద్దు చేసినా ఎన్ని చట్టాలు తెచ్చినా
ఎన్ని సంఘాలు వచ్చినా పూర్తిగా నిర్మూలన
కావటం లేదు దానికి కారణం.
నిరక్షరాస్యత ఆకలి బాధ లింగ వివక్షలు,
ప్రభుత్వాల పనితనం, చట్టాల అవగాహన కలిగి
వుండడము ఉపాధి అవకాశాలు, ప్రజల ఆర్థిక
స్థితి గతులు, అన్నింటిపై
ఆధారపడి వుంటుంది .
ముఖ్యంగా జీవన విధానం
విద్య ఉద్యోగం ప్రత్యక్ష నిదర్శనం కొన్ని దేశాల్లో
ఆకలి కేకలు తప్పడం లేదు
ప్రతి దినం బ్రతకడానికి పోరాటం తప్పనిసరి కాని
కనీస ఆదాయ మార్గాలు
లేక పిల్లలు వలస కూలీలుగా మారుతున్నారు
శారీరక మానసిక పరిపక్వత
లేకుండా వారు విద్యకు
దూరంగా ఉండటం వలన
వారిలోని నైపుణ్యాలు బయట పడక వారిలో అత్యధికులు వివిధ వృత్తులలో రానించరు
ప్రతిభ బయట పడే అవకాశాలు తక్కువ అదే
బాలలు నిర్మాణ రంగం
పారిశ్రామిక రంగం ఇంకా
గృహ సేవకులుగా , కనీస అవసరాలు లేకుండా వారు
మనమద్యే మనకోసం
శ్రమ దోపిడీకి గురవుతున్నారు, సొంత ఊరిని విడిచి పట్టణాల్లో
బ్రతుకు పోరాటం చేస్తున్నారు . వారి సంరక్షణ
బాధ్యత తల్లి తండ్రులు గా
వున్నా వారి మనుగడకు అవసరమైన చర్యలు ప్రజా
పరంగా ప్రభుత్వ పరంగా
లక్ష్యాలు నిర్దేశించి చూపాలి
అప్పుడే సమాజం పురోగమిస్తోంది. వారి ఉన్నతికి తోడ్పాటు కలుగుతుంది చిన్నారులకు
కనీస భద్రత, ప్రాధమిక విద్య , లేకుంటే సామాజికంగా , ఆర్దికంగా
వెనుకబడి కొన్నిసార్లు వారివల్ల చెడు ప్రభావితం
కూడా వుంటుంది కాబట్టి
ఇది అందరి బాధ్యత గా
మీల్కొక పోతే వారే వచ్చే
యువతరం యువత
అన్నిరంగాల్లో అభ్యుదయం
కనబరుస్తూ వుంటే దేశం
భవిష్యత్తు అంత భాగా
వుంటుంది . ఆధునిక యుగంలో వారు భాగస్వాములే వారికి
అన్నీ అందాలి అప్పుడే
గతి స్థితి మారుతుంది.
– జి. జయ