పాలమీగడ
నీవు పక్కనుంటే
పాల మీగడల వాసనలు
కమ్మగా నీ తనువు మీదుగా
ముక్కుపుటాలను అలరిస్తుంటాయి…
నీ మేని ఛాయను చూస్తుంటే
దేవతలిలానే ఉంటారేమో
నాకోసం దిగివచ్చిన దేవతవు
నీవే అనుకుంటాను
తళతళలాడే మెరుపుతో
నాకోసం దిగివచ్చిన అప్సరవై
కనులముందు కదలాడుతుంటే
నను నేనే మైమరచిపోతుంటా…
ఎంత పొగిడినా
ఎంతెంత పొంగిపోయినా
చివరకు చిక్కి శల్యమై నశించే
మేని ఛాయకి నేనెందుకు
ఇలా ఆకర్షింపబడుతున్నానో…
ఎంత వైరాగ్యం ఆవహించినా
మరెంత నైరాశ్యం నిండుకున్నా
ప్రేమలో మునిగిన పిపాసినిగా
తనువు మనసు నీకప్పగించా
ఎలా చూసుకుంటావో మరి ప్రియా!
– ఉమామహేశ్వరి యాళ్ళ