ఓటమి- గెలుపు
నీ గమ్యానికి చేరువలో ఓటమి ఎదురైతే…
ఓర్పును కోల్పోయి నిరాశా పడుతున్నవా…??
లేదా సమయం నీకు ముందరున్న విజయాన్ని పొందుటకు…?
రాదా కాలం నీవైపు ఎక్కడో ఉన్న గమ్యం చూపుటకు..!
ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయని ..
గడిచే సమయం ఆగిపోయినట్లు, ఉన్నచోటే ఉండి చూస్తున్నావా…?
దైర్యాన్ని కూడబెట్టి , నరాలు బిగించి సత్తువ చూపించి ఎదుర్కొ వచ్చే అవరోధాల్ని ఉన్నత ఆశయంతో…
దేబ్బలేవో తగిలయని దిగులు పడితే ఎలా… ?
దైర్యం తో ముందుకెళితే ముందుండేది ఔషదమే..
ఆగి ఆగి గమనించు అడ్డుకట్టలు ఉండే ఉంటాయ్..
ఆలోచనతో ముందుకెళితే అవే నీకు ఆనకట్టలు …
ఆశయం తో ఉన్నప్పుడు ఆవేశ పడమాకు..!
సూక్ష్మదృష్టితో చూడు చిన్న గా ఉన్న సుడిగుండాలను…!
వేసే అడుగుకి, చుసే చూపుకి ,నీలో ప్రవహించే రక్తానికి ఒకటే చెప్పుకో…
ఓటమే నీ గమ్యానికి మార్గం అని
విజయానికి కారణం అని…
– కుమార్ రాజా