ఊహల సరిహద్దు
కవికి, రచయితకు ఊహలెక్కువ..
ఊహల్లోనేగా బ్రతకడం..
ఆ మాటకొస్తే మనుషులందరికీ..
ఊహలెక్కువే!
ఊహా ప్రపంచాలు ఎక్కువే!
ఆ ఊహలే కోరికలు కలిగిస్తాయి..
ఆ కోరికలే గుర్రాలౌతాయి..
మనిషి ఆశలను రెట్టింపు చేస్తాయి..
ఒక్కోసారి నెరవేరుతాయి..
ఒక్కోసారి బొక్కబోర్లా పడేస్తాయి..
అందుకే..
ఆశలకు అంతుండాలి..
కోరికలకు కొలతలుండాలి..
ఊహలకు సరిహద్దులుండాలి..
హద్దులు మీరితే ప్రమాదం..
ఊహలను హద్దుల్లోనే ఉంచుకోవాలి..
– ఉమాదేవి ఎర్రం