ఊగిసలాడే ఉగాది
ఏరువంకల, ఎడ్లబండ్ల వెక్కిళ్ళని మాన్పి
అరిగిపోయిన అనుబంధాల్ని అతికించి
అలసిపోయిన కాలాన్ని కళతో బతికించింది
యుగానికి, ఉత్సవానికి ఆరంభమైనా
వనాలకు వన్నెలద్దే వసంతమైనా
మొక్కుబడి మనుషుల ఉత్తమ నటనలో ఊపిరిసలపని ఊగిసలాటలో
ఊపిరాడని ఉగాది పండగ
ఉత్సహాన్ని తేకపోతే దండగే కదా
ఊపిరిలేని గాలిమనుషులకు
ఉత్తమమైన నకిలీ మనసులకు
పోలికలేని పోల్చుకోలేని మార్పుని
అందించి ఆరంభమయ్యేదే అసలైన
యుగాది, అదే ఉత్తమైన ఉగాది
– భరద్వాజ్