ఓ యువత
నీకు ఆకాశం కూడా హద్దు కాదు,
నీ కలల సాకారం అంత కష్టం కాదు,
నిన్ను నువ్వు నమ్ము,
నీ వల్ల కాదు అనే వాళ్ళు చాలా మందే ఉంటారు,
నీకు ఎందుకు అంత పెద్ద కలలు అని కూడా అంటారు,
వాళ్ళు అంటూనే ఉంటారు,
నువ్వు సాగిపో,
ఆ మాటలు వినపడనంత దూరం ఎదిగిపో.
భయం అనే ఆ గీతను దాటి చూడు,
నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దాటి చూడు,
నీ లక్ష్యాన్ని మాత్రమే చూడు.
గెలుపు నీ బానిస కాకపోతే నన్ను అడుగు.
– ఈగ చైతన్య కుమార్