ఒంటరి

ఒంటరి

 

నిర్మానుష్య దారుల్లో మిరు ఒంటరిగా వెళ్తున్నారు. అప్పుడే అక్కడికి ఒక సన్నని గాలి వచ్చింది.గాలి తో పాటు ఒక తెల్లని ఆకారం మీ వెనకాలే వస్తుంది.

అలా ఒక ఆకారం మీ వెనక ఉందని మీకు కాసేపటికి అర్ధమై భయపడుతూ ఉన్నారు కానీ ఆ భయాన్ని బయటకు కనిపించకుండా ఘభిర్యన్ని చూపుతున్నారు.

ఇంకా మీరు నడుస్తున్నారు. మీరు చేరే దూరం చాలా ఉంది కాబట్టి నడుస్తూ. వెళ్తున్నారు.చుట్టూ ప్రక్కల ఎవరు లేరు.అయినా మీరు వెనక్కి చూడకుండా నడుస్తూనే ఉన్నారు ఆ ఆకారం మిమల్ని ఫాలో చేస్తూనే ఉంది.

మీరు భయపడుతున్నారు. అది దెయ్యమా ఇంకేదైనా నా అనేది మీకు తెలియడం లేదు. ఏం చేయాలో మీకు అర్దం కావడంలేదు అయినా మొండి గా ముందుకు నడుస్తూనే ఉన్నారు.

ఇంకాసేపు అయితే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.ఇక నా లక్ష్యం వచ్చేసింది అనే ధైర్యం తో వెనక్కి తిరిగి చూశారు .అక్కడ తెల్లని బట్టలతో ఒక ఆకారం ఉంది.

ఆ ఆకారం ఏవేవో సైగలు చేస్తుంది అవేవీ మీకు అర్థం కాలేదు. ఇంతలో లోపలి. నుండి మీ అబ్బాయి వచ్చాడు. ఆ ఆకారాన్ని చూసి ఎంటమ్మ ఇవిన్ని తెచ్చావు అసలు ఏమైంది అంటూ మీ వెనక్కి వెళ్ళాడు.

అక్కడ మీ కొంగు కు ఆమె చున్ని చుట్టుకుని ముడి వేసి ఉంది. మీ బాబు అది విప్పుతూ ఎంటమ్మ వెనకాల ఎవరున్నారో కూడా చుడుకోవా పాపం ఆమె మూగ అమ్మాయి కాబట్టి చెప్పలేదు.

కనీసం నువ్వైనా గమనించాలి కదా అంటూ ముడి విప్పేసి ఆ అమ్మాయి చేతిలో కాస్త డబ్బు పెట్టీ పంపాడు. మీరు అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంతా చేసింది ఈ మూగ అమ్మయా.

నేను భయపడింది ఈవిడ కా అనుకుంటూ నవ్వుతూ లోపలికి వెళ్తున్నా మిమల్ని చూస్తూ మీ బాబు ఏంటో మా అమ్మ పిచ్చిది అనుకున్నాడు తల కొట్టుకుంటూ...

 

-భవ్యచారు

0 Replies to “ఒంటరి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *