ఒకటే

ఒకటే

ఒక ఉదయం
ఒక ధైర్యం!
ఒక సాయం సంధ్య
ఒక జ్ఞాపకం!
ఒక నడిరేయి
ఒక అనుభవాల పుప్పొడి!
ఒక జీవితం
ఒక కోరికల సమాహారం!
ఒక కుటుంబం
ఒక అనురాగ సంగమం!
ఒక వ్యక్తి
ఒక ఆలోచనల పుట్ట!
ఒక సమూహం
ఒక కార్యాచరణ భాండాగారం!
ఒక అక్షరం
ఒక తేజస్సు!
ఒక కల
ఒక గమ్యానికి వెలుగు!
ఒక భావం
విస్తరించే అనేకం!

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *