ఒకరేష్మాకథ
అందమైన పల్లెలో ఒక ముస్లిం కుటుంబం లో జన్మించింది రేష్మా, చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా లేకున్నా మొహం లో ఏదో ఒక మెరుపు వస్తుంది
అలాగే నవ్వుతుంటే కూడా పెదవుల పైన చిరునవ్వు లు మెరుస్తూ ఉంటాయి. .మగ పిల్లాడు పుడతాడు అని తండ్రి నలుగుర్ని ఆడపిల్లల్ని కన్నక కానీ అర్ధం కాలేదు.
ఇక భార్య నా వల్ల కాదు అనండo తో భార్య పై కోపం తో ఇల్లు విడిచి వెళ్ళాడు.
అప్పటి నుండి రేష్మా తల్లి ముంతాజ్ చిన్న చిన్న పనులకు వెళ్తూ తన పిల్లలను చూసుకుంటూ, వెళ్ళిన మొగుణ్ణి తిట్టుకుంటూ కూలి పనులు చేసి తన పిల్లలకు ఇంత తిండి పెడుతూ పోషిస్తూ ఉంది. రేష్మా కాస్త పెద్దది కావడం తో తల్లి నీ అర్దం చేసుకుని ఇంట్లో పనులన్నీ చేసేది. అలసిపోయి వచ్చిన తల్లి రేష్మా చేసింది చూసి చాలా సంతోషించేది.
**********
అదే పల్లె లో మసీదు లో ఖదీర్ మత పెద్దగా ఉండేవాడు. యాభై ఏళ్లు వయసు అతనిది.కష్టం,సుఖం తెలిసిన వాడు కాబట్టి ముంతాజ్ కి మసీదు నుండి కొన్ని వస్తువులు,బట్టలు ఇచ్చేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ ఖదీర్ ఎప్పటికీ సాయం చేయలేడు కదా ,ఒక రోజు అతని దగ్గర కి అతని స్నేహితుడు వలీ వచ్చాడు.
ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ముంతాజ్ విషయం వచ్చింది.పాపం ముంతాజ్ నలుగురు పిల్లల్ని పోషించ లేక పోతుంది.తనకు ఏదైనా సాయం చేయాలి అన్నారు ఖదిర్ వలీ తో.
అరె భాయ్ నాకీ ముంతాజ్ చిన్నప్పటి నుండీ తెలుసు,ఆమె బాధ లో ఉంది. మనం ఏదైనా సాయం చేయాలి ఖదిర్ . నాకు ముంతాజ్ అబ్బా సాయం జేస్తెనే నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నా కాబట్టి నేనే ముంతాజ్ కి సాయం జేస్త భాయ్ అన్నాడు.
దానికి ఖదీర్ అరె భాయ్ ఎలాగైనా చేయ్, ఆ అల్లా నే ముంతాజ్ కోసం నిన్ను పంపాడు అనుకుంటా అన్నాడు పైకి చూస్తూ,
వలీ లేస్తూ అచ్చా హం జాకే ముంతాజ్ కో బాత్ కర్తే అన్నాడు. అచ్చి బాత్ హై ఖుధాఫీజ్ అన్నాడు ఖదీర్, ఖుధాఫీజ్ అంటూ సలాం చేసి ముంతాజ్ ఇంటి వైపు గా వెళ్ళాడు.
************
ఒక చిన్న పూరి పాకలో నలుగురు పిల్లలతో కలిసి ఉంటుంది ముంతాజ్. వలి వెళ్లేసరికి రేష్మ వంట చేస్తుంది. పిల్లలు ముగ్గురు ఆడుకుంటున్నారు. ముంతాజ్ ఇంకా రానట్టుగా ఉంది. వలి ఏ బచ్చి తుమారి మా కహా హై అంటూ అడిగాడు. హా జీ ఆజ్ కామ్ సే నయాయి హంబి దేక్రే అని ఈ కొత్త వ్యక్తి ఎవరో అంటూ వెనక్కి తిరిగి చూసింది. వలీ రేష్మ ను చూడగానే కళ్ళు తళుక్కుమన్నాయి.
రేష్మ ఆమె అందంగా లేకపోయినా కళ్ళు మెరుస్తున్నాయి, పెదవులు నవ్వుతున్నాయి ఆమె ముఖంలో ఏదో కాంతి కనిపిస్తుంది. నిజానికి వలీ చేసేది అమ్మాయిల వ్యాపారం. అయితే ముంతాజ్ తండ్రి తనకు చాలా సాయం చేశాడు. కానీ ఇప్పుడు అవి అతనికి గుర్తుకు రాలేదు. రేష్మా ని చూస్తూ అలాగే ఉండిపోయాడు.
ఇంతలో ముంతాజ్ వస్తూ క్యా భయ్యా కబాయే అంటూ పలకరించింది. ఆలోచనల నుంచి తేరుకున్న వలీ ముంతాజ్ ని చూస్తూ ఆ అభి అయే ఏ ఆప్కా బేటి హై క్యా అంటూనే రేష్మను చూస్తూ అడిగాడు.
అవునన్నా నా పెద్ద కూతురు రేష్మ, అది లేకపోతే నేను పనికి పోయేదాన్ని కాదు. ఇల్లంతా చక్కపెట్టి , పిల్లల్ని చూసుకుంటుంది. నేను కూలికి పోయి వచ్చేసరికి ఇంత వండి పెట్టి నాకు సాయంగా ఉంది. అంటూ తన పరిస్థితిని వివరించింది ముంతాజ్.
అరే అరే ముంతాజ్ నువ్వు ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతావ్, నీ భేటీని నాతోటి పంపు, నేను మంచి పని చూపిస్తా నీకు, పైసలు బాగా వస్తాయి అన్నాడు వలి. వలి గురించి కాస్త కూస్తో తెలిసిన ముంతాజ్ ఆ మాటకు ఇంత ఎత్తున లేచి పడి,
చల్ నికల్ జా ఏదో అన్నా నీ పలకరిస్తే నా కూతురికే ఏసరు పెట్టడానికి వచ్చావు, నీ కన్ను నా కూతురు మీద పడిందా? ఇంకా ఇక్కడి నుంచి పో లేకపోతే అందరిని పిచ్చి పెద్ద గొడవ చేస్తా అంది ముంతాజ్ కోపంగా,
ఆమె కోపం చూసిన వలి ఇక ఇలా కాదని, అరే ముంతాజ్ కోపం ఎందుకు చేస్తావ్ చెప్పు, నేను నీ మంచి గురించే చెప్తున్నా నీకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు వాళ్లకు షాది ఎట్లా చేస్తావ్ ఏమి ఉందని చేస్తావు. జర సమాజ్లో ఆలోచించి చూడు ఒక్క బిడ్డ పోతే ముగ్గురు బిడ్డలు బాగుపడతారు. నాతోనే పంపు, క్యా హోతా ఉనుకో అచ్చా కపడ మిల్తా, అచ్చ ఖానా మిళ్తా, ఔర్ అప్ బీ అచ్చే హోతనా , ఏక్ లడికి బాహర్ గాయే తో అప్ సబ్ జనా అచ్చ హోతే, సోచో అంటూ వలి ముంతాజ్ ను ఆలోచనలో పడేలా చేశాడు.
నిజమే ఒక్క రేష్మ బయటకు వెళ్తే మిగిలిన తాము బాగు పడవచ్చు,మిగిలిన పిల్లల జీవితం బాగుపడుతుంది. తాము కాస్త మంచిగా బ్రతకవచ్చు అని అనుకుంటుంది మనసులోముంతాజ్. మరో వైపు రేష్మా ఆలోచనలు దాదాపు ఇలాగే ఉన్నాయి. తానొక్క సారి బయటికి వెళ్తే తన తల్లి, చెల్లెళ్ళు బాగుపడతారు.
గంజి నీళ్లు తాగేవారు కనీసం ఒక పూట అయినా అన్నం తింటారు. పోతే పోయింది నా జీవితం ఏముంది ? ఎవరికో పెళ్ళాం గా ఉండేది ,అక్కడ అందరికీ పెళ్ళంగా ఉండవచ్చు. అంతేగా అనుకుని గబగబా వచ్చి అమ్మి అమ్మి నేను మామ తో కలిసి వెళ్తాను అంది. ముంతాజ్ అదే ఆలోచనల తో ఉండడం వల్ల సరే బెటా వేళ్ళూ అంది.
వలీ సంతోషానికి అవధులు లేవు. లక్షలు పలుకుతుంది రేష్మ చిన్న పిల్ల కాబట్టి తనకెంతో లాభం అనుకున్నాడు మనసులో. మరి ఇంకేం అమ్మాయి కూడా ఒప్పుకుంది కాబట్టి వెంటనే పంపు అన్నాడు వలి.
************
ఇన్నాళ్లు. తనకెంతో సాయం చేసిన రేష్మ వెళ్తుంది అనగానే దుఖం ఆగలేదు ముంతాజ్ కి , రేష్మ ముంతాజ్ ఇద్దరూ ఒకర్ని పట్టకుండా ఒకరు ఏడ్చారు. కడుపున పుట్టిన పిల్లని పంపాలి అంటే ముంతాజ్ కి మనసు ఒప్పడం లేదు కానీ తప్పదు, తాము బాగుపడాలి అంటే ఎవరో ఒకరు బలి కావాలి అది రేష్మ అయ్యింది.అయ్యో రేష్మ ఇంత తొందరగా ఎందుకు పెద్దగా అయ్యావు అంటూ తల్లి మనసు రోదించింది.అక్కడ ఎవరూ ఎలా ఎం చేస్తారో అంటూ భయపడింది.అయినా గుండె దిటవు చేసుకుని , గబగబా లోపలికి వెళ్లి సంచిలో నాలుగు జతల బట్టలు పెట్టుకుని వచ్చి ఇచ్చింది రేష్మ కి ,
వలి రేష్మ. చెయ్యి పట్టుకున్నాడు. ముంతాజ్ మరి డబ్బు అంటూ అడిగింది. నేను అనుకోకుండా వచ్చాను.నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. రంజాన్ రోజు పొద్దున్నే వచ్చి ఇస్తా అన్నాడు వలి. సరే అని నమ్మింది ముంతాజ్.
వలి రేష్మా ను తీసుకుని బయలు దేరాడు. రేష్మ వెనక్కి చూస్తూ కళ్ళలోని నీరు తుడుచుకుంటూ అతనితో గొర్రె పిల్లలా వెళ్లసాగింది. ముంతాజ్ కూడా ఆమెని చూస్తూ కన్నీళ్ళతో తడిసిన కళ్ళు తుడుచుకుంటూ నిలబడి పోయింది.
ఇంతకీ రేష్మా వలి తో వెళ్తుందా,? ఆమె జీవితం ఏం కాబోతుంది? తమ బాగు కోసం పిల్లను అమ్ముకున్న ముంతాజ్ మానసిక సంఘర్షణ ఎలాంటిది? కడుపు నిండా కన్నపిల్లను చూసుకోలేని ముంతాజ్ ఒక తల్లేనా ? ఇంతకీ ఏం జరుగుతుంది అనేది తదుపరి భాగం లో చదవండి….
-భవ్యచారు
తర్వాత ఏమి జరుగుతుందో అని ఉత్కంఠభరితంగా ఉంది.