ఒక చిన్న ప్రయత్నం

ఒక చిన్న ప్రయత్నం

 

నా జీవితం చాలా ఆనందం గా ఉండేది.. ప్రయత్నం అనే పదం మర్చిపోయాను, చెయ్యాలనే ఆలోచన కూడా ఉండేది కాదు..పొద్దున్నే లేవడానికి కూడా ప్రయత్నం చేసే వాడిని కాదు, మెలుకువ వచ్చిన్నప్పుడే లేచేవాడిని..వొండుకునే ప్రయత్నం లేదు, ఆర్డర్ పెట్టుకునే వాడిని,బుర్ర వాడే ప్రయత్నం కూడా చెయ్యలేదు దానికి ఫోన్లు, లాప్టాప్, కాలిక్యులేటర్ వున్నాయి…అలా సాగేది నా జీవితం..

ఒకరోజు నా మిద్రుడు కలిశాడు చాలా ఏళ్ల తర్వాత కలిశాం చాలా కబుర్లు చెప్పుకున్నాం…అలా మాట్లాడుకుంటూ ఉద్యోగం గురించి, జీతం గురించి మాట్లాడుకున్నాం.నా జీతం చాలా తక్కువ ఇప్పుడున్న పరిస్తితికి..ఒకసారి చూసుకోమన్నాడు..వాడు, వాళ్ళ ఆవిడ ఇద్దరు చాలా ఎక్కువ సంపాదనలో ఉన్నామని చెప్పారు…వాళ్ళ జీతం అంత నాకు రావడం కష్టమే, కనీసం కొంచెమైనా పెంచమని ఆఫీస్ లో అడగమన్నాడు..

ఎప్పుడు, అసల అవేమీ ఆలోచించ కుండా గడిపేసాను ఇప్పుడు వీడితో మాట్లాడాక తెలిసింది నేను చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నానని..కానీ ఏం చెయ్యాలో తెలీదు ఎవరిని అడగాలి అని ఆలోచించ.. మిత్రుడినే అడుగుదామని వెళ్లి వాడిని మళ్లీ కలిసాను..వాడు ప్రయత్నం చేయమని చెప్పాడు..

ఆ మాట చాలా సంవత్సరాల తరువాత అప్పుడే నేను వినటం.. ఇపుడు మంచి కంపెనీ కి మారాలంటే ప్రయత్నం చేయాలని చెప్పాడు…నేను కంపెనీ మారాలని ఆలోచించాను అన్ని చోట్ల నా CV ని పంపాను తెలిసినవాళ్లకి చెప్పాను.. అలా ఎన్నో ప్రయత్నాలు చెయ్యగా.. నాలుగు నెలలకి ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యు కి రమ్మని చెప్పారు.. నేను వెళ్ళాను వాళ్ళు నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇన్నేళ్ళు ఇంత తక్కువ జీతానికి పని ఎందుకు చేశావని..
అప్పుడు అనుకున్న, ప్రయత్నం చేయలేదు అని..

కానీ వాళ్ళకి వేరే కారణాలు వల్ల అని చెప్పాను.. వాళ్ళు అడిగిన వన్నిటికి సమాధానం చెప్పాను.. వాళ్ళకి నా ఉద్యోగ అనుభవం నచ్చింది. నాకు వాళ్ళు ఉద్యోగం ఇస్తామన్నారు, నా ఈ ప్రయత్నానికి కారణమైన నా మిత్రుడిని కలిశాను…ఎంత జీతం అడిగావు?? ఎంత ఇచ్చారు?? అని అడిగాడు..నా జీతం ఇప్పుడు వాడిది, వాడి భార్యది కలిపితే నా జీతం…
అది విని వాడు ఆశ్చర్యపోయాడు. ఇపుడు వాడు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు… అప్పుడు తెలిసింది అప్రయత్నం మనల్ని ఎంత వెనక్కి   నెట్టేస్తుందో…

 

-శ్రీ కిరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *