ఔచిత్యమై గెలుస్తుంది!!!
కూచిన ప్రతిసారి పిలుపొక
వేయి ప్రాకారాలకు ద్వారాలు
తెరస్తు…కోరికల మకరందాలను
చిలికిన అలికిడి తనదేనని చెప్పిన
కోయిలది ఒక కోరిక….
నిత్యమై ఆకాశపు తారకమై వెలుగుల
ప్రఛోదకాలను తాగుతు…
నిత్య మందిర పూజితమై ప్రకృతి యొక్క
మచ్చిక తనకు మమకారమై మనస్సునా
కదలిన రూపం….
తమ జాతిగా నెగడాలనే తపనని
బతికిస్తున్నది ఆ కోరిక…
తలచిన గమ్యం పొడిబారినప్పుడు
దూరం కనిపించని తీరమని
మోసపోకు….
దగాపడ్డ జీవితాలకై కోరికలను
ఉద్యమిస్తు తపనలు చేసిన వాడిగా
శ్వాసలు బీజమై కోరికలు
ప్రయత్నాలై…
అనుకున్నది దొరికించు కోవాలనే
నైతికత తేజమై…ప్రతి నుదిటిన
తిలకాన్ని దిద్దుతు…
నడిచే లోకానికి తోడు నడిచిన
విశ్వాసమే కోరికలుగా
సాధ్యమవుతు…
బతికి బట్టకట్టిన మన్నింపుల
మాగాణులతో ఒక మనస్సుతో
ఒక మనస్సు పురివిప్పినదై…
లోకం వింతలను రూపుమాపుతు…
నూతనోత్సాహాల ప్రతిభతో ఊరేగుతు
తడిచిన అడుగుల ప్రభావితాలను
దేశమేలే ఔచిత్యమై…జయిస్తుంది కోరికగా
-దేరంగుల భైరవ