ఓ యువతి.. అందుకో నా అక్షర హారతి..
ఎవరికోసమా చూపులు..
వినిపించాయా నీ లోలోపలి పిలుపులు..
తెరచుకున్నాయా నీ ప్రియవారల హృదయ తలుపులు..
నీ మనసులోని మౌనరేఖలు..
కనబడుతున్నాయి నీలోని రహస్య ఛాయలు.
ఆపై అర్థమవున్నాయి నీ భావనలు..
నీ మోముపై నవ్వు చూడాలి..
నా మనసు కుదుట పడాలి..
నీవనుకున్నది నీకు కలగాలి..
నేననుకున్నది నాకు కలగాలి..
ఆపై ఇద్దరం ఈ జగాన్ని మరవాలి…
నిజం చెప్పు…
నా కోసమేనా నీ వెతుకులాట…
లేక.. అందని నేటి శ్రీరామనవమి పానకం కోసమా..??
– కిరీటి పుత్ర రామకూరి