ఓ వ్యక్తి కథ
అనగనగా ఓ వ్యక్తి ఉండేవాడు. ఎలాంటి చీకు చింత లేకుండా చాలా సంతోషంగా వాడి దగర డబ్బు ఉంది అన్నే గర్వం కూడా చాలా ఎక్కువగానే ఉండేది.. అతని తండ్రి ఓ వ్యాపారవేత్త కాబట్టి కనీసం వాడికి బయట ప్రపంచంతో కూడా పని లేదు. స్నేహితులు ఇంటికి వచ్చే వాళ్ళు. అక్కడే పార్టీ చేసుకునే వారు. అక్కడే తాగే వారు అక్కడే పడుకున్నే వారు.
అనుకోకుండా అతని తండ్రి చనిపోయాడు తల్లి బాధ్యత అంత అతని మీద పడింది. అయినా ఏం పట్టించుకునే వాడు కాదు కనీసం వ్యాపారం చూసుకునే వాడు కాదు ఇంట్లో ఉన్న డబ్బులు అయిపోయే సరికి వ్యాపారంలో డబ్బులు వాడుకునే వాడు. అలా అతను వాడిన డబ్బు 10000/- అయితే 100000/- అన్ని రాసేవారు… అలా మొత్తానికి వ్యాపారం దివాలా తీసే స్థితికి వచ్చేసింది.
జీతాలు ఇవ్వలేకపోయేవారు ఉద్యోగాలు అందరు మానేశారు… వ్యాపారం మూతపడింది… అప్పటి వరకు ఇతని వెంట ఉన్న స్నేహితులు ఇతన్ని పటించుకోవడం మానేశారు అప్పుడు అతనికి అర్థం అయింది డబ్బు ఉంటేనే ఎది అయినా ఉంటుంది అని కష్టపడడం మొదలు పెట్టాడు అలా మళ్ళీ డబ్బు సంపాదించి మళ్ళీ గొప్ప స్థాయికి వెళ్ళాడు… మళ్ళీ అందరూ వచ్చారు…
మన దగ్గర డబ్బు ఉంటేనే ఎవరైకైనా మనతో బంధం, సంబంధం లేకపోతే ఎం ఉండదు అన్ని అర్థం చేసుకున్నాడు.
– వంశీ