ఓ బాటసారి
గమనం లేని ఓ గమ్యం కోసం గెలుపు బాటలు వెతుకుతూ ఓటమి అంచనా నిలబడి యుద్ధం చేసే ఓ బాటసారి నీకు నా వందనాలు. పరపతి పరువు ప్రతిష్టలు గురించి ఆలోచించకుండా నీకు నచ్చింది నీకు తోచింది చేస్తూ ఎవరి మాటలు పటించుకోకుండా నీవు అనుకున్నదే సత్యం నీవు నడిచే మార్గమే నీ నేస్తం అయింది. నీకు ఈ లోకంమే దాసోహం అనేలా నీ ప్రయాణాన్ని మార్చుకుని చివరికి విజయం సాధించి నీతో కాదు అనే పనిని నువ్వు చేసి చూపించావు అక్కడితో నువ్వు నీ ప్రయాణంలో చూసిన ప్రతి ఒక కష్టం ప్రతి ఒక పని నీ గెలుపుకి మార్గం లాగా చేసుకున్నావు. నిజంగా నీకూ నీ ప్రయత్నానికి జోహార్లు బాటసారి.. నీవే మాకు మార్గదర్శి… ఓ మా బాటసారి
– వంశీ