న్యాయమా నీవెక్కడ
అందాల చిన్ని పాప ఆడుకుంటూ పాడుకుంటూ చదువు కోసం బడికి వెళ్తుంది. అక్కడ పొంచి ఉన్న ఒక రాక్షసుడి కన్ను ఆ పాపపై పడింది. వాడు ఊరుకుంటాడా అనుకున్నదంతా చేశాడు. పాపం పుణ్యం ఎరుగని ఆ పాప ఏడుస్తూ ఇంటికి వచ్చింది ఏం జరిగిందని తల్లి అడిగినసరికి ఆ పాప ఆ రాక్షసుడు గురించి చెప్పింది.
ఆ మాటలు విన్న తల్లి గుండె పగిలింది నిజమో అబద్దమో పాప ఏం చేస్తుందో అసలు అర్థం కాలేదు. అవన్నీ నిజాలే అని తెలుసుకోవడానికి ఆమెకి కాస్త సమయం పట్టింది. ఆ సమయంలో ఆమె చాలా నిజాలనే తెలుసుకుంది. తన పాప ఒకటే కాదనుకుంటూ ఇంకా చాలామంది చిన్నారులను చిదిమేసిన ఆ రాక్షసుడిపై పోరాటానికి దిగింది.
పోరాటం పెద్దల వరకు వెళ్ళింది. పెద్దలు ఎన్నో రకాలుగా వారిని మబ్బ పెట్టేందుకు ప్రయత్నం చేశారు. మహిళా సంఘం వాళ్ళు దిగి మీకు న్యాయం చేస్తాము అంటూ దిగారు. ధర్నాలు రాస్తారోకోలు మానవహారాలు దీక్షలు ఇలా ఎన్నో చేశారు. మొత్తానికి వాడిని పట్టుకుని జైల్లో వేశారు. ఓహో చూశారా మా వల్లే మీకు న్యాయం అంటూ అన్ని సంఘాల వాళ్ళు మా గొప్ప అంటే మా గొప్ప అని చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నారు తల్లిదండ్రులు కూడా నిజమే కాబోలు అనుకున్నారు.
కానీ ఒక్కరు కూడా ఆ పాప పరిస్థితి గురించి ఆలోచించలేదు జరిగిన సంఘటన ఆ అమ్మాయి మనసులో ఎంతటి ఒత్తిడికి తీసుకు వెళ్తుందో ముందు ముందు జీవితంలో ఎలాంటి పరిస్థితులకు లోనవుతుందో అనేది ఎవరూ ఆలోచించలేదు న్యాయం జరిగింది అంటూ సంబరాలు చేసుకున్న వారు జైల్లో వారికి జరిగే రాజభోగాల గురించి కానీ లేదా నాలుగు రోజుల్లో బెయిల్ పై బయటకు రావడానికి గురించి కానీ ఆలోచించలేదు. అలాగని సత్వర న్యాయం కోసం వారిని చెప్పమనడం కూడా న్యాయం కాదు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం.
ఆ అమ్మాయికి నిజానికి న్యాయం జరిగిందా అసలు న్యాయం అంటే ఏమిటి? పాపగా అనుభవించాల్సిన లేత ప్రాయం అలాగే ఒక అమ్మాయిగా నుండి అమ్మగా మారే క్షణంలో కోల్పోవాల్సిన దాన్ని ఇప్పుడే ఇంత చిన్న వయసులోనే కోల్పోవడం ఎంత బాధాకరం ఈ విషయాలేవీ గుర్తుకు రావా అప్పుడు అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటివి అని ఎవరైనా ఆలోచించారా? లేదు.
అమ్మాయిగా మారిన తర్వాత కొంచెం వయసొస్తున్నప్పుడు తన స్నేహితులు కానీ ఇంకెవరైనా కానీ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నీకు ఇలా జరిగిందట కదా అప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతే ఆ అమ్మాయి పడే నరకం ముందు ఈ న్యాయం నిలబడుతుందా? ఎవరైనా ఆలోచిస్తారా? ఏదైనా అన్యాయం జరిగింది అనగానే ముందు వెనుకలు ఆలోచించకుండా న్యాయం జరగాలంటూ రోడ్డు ఎక్కడ న్యాయమాలు మూసుకొని ఏమీ జరగనట్టు అంతా మర్చిపోయి ఎప్పటిలా ఉండడం సాధ్యమా? అంటే సమాధానం లేదు సాధ్యం కాదు.
అలాగని చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేం అన్యాయాన్ని దాచిపెట్టి మన జీవితాన్ని నిజాన్ని దాచుకొని మరొకరు చేతికి అందించినప్పుడు నిజమైన తెలుస్తుంది ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి అలా నిజం తెలిసినప్పుడు ఆ అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులకు ఎంత అవమానం, అమ్మాయిని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అసలు వాళ్లు పడే నరక వేదన నరకయాతన ఎంతటి వేతనం ఎవరికి తెలుసు అనుభవించే వారికి తప్ప.
వారిని అరెస్ట్ చేయగానే జైల్లో పెట్టగానే న్యాయం జరిగినట్టు కాదు మరి న్యాయం అంటే ఏమిటి అలా చేసిన వారిని ఎన్కౌంటర్ పేరుతో చంపేయడమా అలా చంపేయడం వల్ల తన కుటుంబాన్ని రోడ్డున పడేసినట్టే కదా మరి ఇంకెలా న్యాయం చేయాలి అరెస్టు చేయొద్దు అంటారు చంపొద్దు మరి ఇంకెలా న్యాయం జరుగుతుంది అనేది మీ ప్రశ్న అయితే నిజంగా అలా జరిగినప్పుడు ఆ అమ్మాయి పడే నరక వేతన అలాంటి ప్రశ్నలు వస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడే నరకయాతన ఎలా ఉంటుందో ఎదుటివాడికి కూడా అలాగే జరగాలి.
ఇది హింసకు దారితీస్తుంది అనుకోవచ్చు లేదా ఎదుటివాడికి కూడా అలాగే జరగాలని ఒక స్వార్థం పెంపొందించవచ్చు ఇలాంటి నేరాలు జరిగినప్పుడు విదేశాల్లో వారికి వేసే శిక్షలు ఘోరంగా ఉంటాయి వాడిని అక్కడికక్కడే తల నరికి చాంపిస్తారు తను జీవితంలో అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేడు. అలాగని జీవితంలో ముందుకు పోలేదు మరి ఒక చిన్నారి పాపకు అభం శుభం తెలియని ఆ చిన్నారి పాపకు ఏమీ తెలియని వయసులో జరిగింది అన్యాయం అని ఎలా తెలుస్తుంది?
ఏం చేయాలి ఇంతకీ అసలు నేను చెప్పాలనుకున్నది ఏంటి ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి వారికి ఎలాంటి శిక్షలు వేయాలి అంటే సమాధానం చాలా ఈజీగా చెప్పొచ్చు కానీ అది అవుతుందా లేదా అనేది కూడా మనం ఆలోచించగలగాలి. నా వరకు నేనైతే ఒక పరిష్కారం అనేది తెలుసుకున్నాను అది ఎంతవరకు మంచిదో కాదో నేను ఆలోచించలేదు కానీ నాకు అనిపించింది మాత్రం చెప్పాలని నిర్ణయించుకున్నాను.
అదేంటంటే యవ్వనంలో నుంచి వచ్చిన ప్రతి మగాడికి లేదా పదేళ్ల అబ్బాయి నుంచి పండు ముసలి వరకు కౌన్సిలింగ్ ఇవ్వాలి మీ ఇంట్లో పిల్లలు ఎలాగో మీకు మీ కుటుంబం ఎలాగో బయట వారి అవతరి కుటుంబం కూడా అవతలి పిల్లలు కూడా అలాగే అని వాళ్లకి తెలిసేలా చేయగలగాలి అప్పుడే ఇలాంటి నేరాలను అరికట్టగలుగుతాం న్యాయం అనేది జరిగేలా చేయగలుగుతాం.
ఇలాంటి కౌన్సిలింగ్ లు ఉపయోగపడతాయా అంటే నా దగ్గర సమాధానం లేదు. మరి సమాధానం లేని వాటికి నువ్వెలా చెప్పగలవు అంటారా ఆలోచించడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఇలాంటివి జరిగేది మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు తాగినప్పుడు జరుగుతున్నాయి అని సర్వేలో చెప్తారు కానీ తాగని వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రభుత్వం మత్తు పదార్థాలను రద్దు చేయాలి అలాగే చిన్న వయసు నుంచి ఆడపిల్లలకు వారి రక్షణ వారే చూసుకునే విధంగా కరాటే లాంటివి విద్యలు నేర్పించాలి దాంతోపాటు అమ్మాయిలకు అబ్బాయిలకు గుడ్ టచ్, బ్యాట్ టచ్ అనేది నేర్పించాలి. ఇక్కడ అమ్మాయిలు ఒక్కరే బాధపడతారు అబ్బాయిలకు కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ఎన్నో వస్తున్నాయి అని మనం రోజు పేపర్లలో పత్రికలలో చూస్తూనే ఉన్నాం.
అందరికీ కలిపి నేను చెప్పేది ఒకటే చిన్ననాటి నుంచి ఆడపిల్లలకు మగ పిల్లలకు తేడా లేకుండా తమను తాము రక్షించుకునే విధంగా విద్య అనేది నేర్పించాలి అందుకు తల్లిదండ్రులే పూనుకోవాలి ఇకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇలా చేస్తే ఏం చేయాలి వారికి కూడా ఇలాగే కౌన్సిలింగ్ ఇప్పించాలి. కానీ చట్టంలో న్యాయం లో ఎన్నో లోపాలు ఎంతో అవినీతి ఉన్న మన ఈ దేశంలో ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది.
ఇక్కడ న్యాయం ఎవరికీ జరగలేదు. న్యాయం జరిగన వారు ఏడుస్తూనే ఉన్నారు. వారి కుటుంబాలు విసుగు బ్రతుకు మీద ఆశ అనేది చచ్చిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ మన ప్రభుత్వానికి ఏమీ పట్టదు ఓట్లు వేసే ఆ ఒక్క రోజు తప్ప మిగిలిన వాటి గురించి ఆలోచించే తీరిక ఓపిక వారెవరికీ లేవు ఎందుకు పూనుకోవాల్సింది మనమే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. మన పిల్లల రక్షణ చర్యలను మనమే తీసుకోవాలి మనమే ఒక అడుగు ముందుకు వేసి మంచి చెడులను ఆలోచించి ఏది మంచిది అనేది పిల్లలు తెలుసుకునేలా చేయగలగాలి.
కొన్ని సంఘాలు కూడా ముందుకు వస్తే బాగుంటుంది కానీ సంఘాలకు అంత తీరిక ఓపిక ఉండవు కాబట్టి మన పిల్లలను మనమే కాపాడుకుందాం చూసుకుందాం. పైన చెప్పిన సంఘటన నిజంగా మొన్న హైదరాబాదులో జరిగింది. వారిని అరెస్టు అయితే చేయడం జరిగింది కానీ ఇంతవరకు శిక్షలు మాత్రం వేయలేదు.
వాళ్లిప్పుడు హ్యాపీగా బయటకు వచ్చి సంతోషంగా తిరుగుతున్నారు ఆ అమ్మాయి మాత్రం కుమిలిపోతూ ఇంట్లోనే ఏడుస్తుంది న్యాయమా నీవెక్కడ అవినీతి అర్థం కానంతవరకు న్యాయం నీవెక్కడ అని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉంది కానీ ఇక్కడితో ఈ చర్చను ఆపేస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాలు కూడా దయచేసి తెలియజేయగలరు. అలాగే మీకు తోచిన సలహాలు కూడా చెప్పవచ్చు.
– భవ్యచారు