న్యాయం

న్యాయం

అయ్యెా! అయ్యెా! అయ్యెా!
ఎందుకడుగుతారు లెండి..
ధర్మం నాలుగు పాదాల ..
నడుస్తుందని…
పొరపడడమే జరుగుతుంది..
న్యాయం,ధర్మం ఎప్పుడో..
కనుమరుగయ్యాయి…
మేముండలేం ఈ కాలంలో అని..
మా కాలం కాదిది అని..
పాత కాలంలోనె పాతుకు పోయాయి..
పోనీలే! ఓ రెండు పాదాల్లోనయినా..
నడవమని బ్రతిమాలితే..
సరేలే అని..
నీ మాట కాదు నా మాట కాదని.. ఒంటి పాదం మీద..
నడుస్తానంది ధర్మం..
న్యాయమైతే దానికీ ఒప్పుకోలేదు మరి....

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *