న్యాయం కోసం ఎదురు చూసే ఆడపిల్ల
ఎక్కడ న్యాయం? ఎవరి దగ్గర జరుగుతుంది?
అసలు న్యాయం ఎక్కడ ఉంది? ఎక్కడ దొరుకుతుంది?
అసలు న్యాయమా…. నువ్వు ఎక్కడ ఉన్నావు?
అన్యాయానికి తలదాచుకున్నవా? అదేంటి….?
నిజం నిప్పు లాంటిది.. న్యాయం ముందు అన్యాయం ఆటలు చెల్లవు అంటారు కదా..
ఓహో అది కేవలం అన్యాయపు బాటలో న్యాయం ముసుగు వేసుకుని డబ్బుతో అన్యాయంగా న్యాయాన్ని కొనుక్కునే వారికి వర్తిస్తుందా…..?
న్యాయంగా నిజాయతీగా న్యాయం అంటే రాదా….?
రాబందులకు రక్షగా ఉంటావా..
రాక్షసులకు అండగా ఉంటావా….. అవినీతిపరులకు తోడుగా ఉంటావా..?
అసలు ఎక్కడ ఉంటావు..
ఎందుకు బయటికి రావు..
అన్యాయాన్ని ఎదురుకొలేక పోతున్నావా? ఎందుకు నీవు ధైర్యంగా ముందుకు రాలేక పోతున్నావు…
ఆడపిల్ల కష్టం అని వస్తె ఆసరాగా ఒకడు చూస్తాడు..
ఆపదలో ఉన్న అంటే అలుసుగా ఇంకొకడు చూస్తాడు….. అవసరం అంటే చులకన ఒకడికి .
దుఖం అంటే ఓదార్పు పేరుతో అవసరం అంటాడు ఒకడు..
బాధ అంటే బలవంతం అంటాడు ఒకడు..
నాకు న్యాయం అంటే అన్యాయం చేసే వాడు ఒకడు..
ఇలా ఎటు పోయిన ఎం చేసిన అడుగడుగునా ఆడపిల్లల ప్రతి అవసరాన్ని వాళ్లకు అనుగుణంగా మార్చుకునే కిరాతకులు ఉన్నారు .
ఒక స్త్రీ కి మాత్రమే కాదు అన్యం పుణ్యం ఎరుగని బాలలు….
ఎం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆభాగ్యులు ఇలా ఎంతో మంది పసిపిల్లలు…. ఆఖరికి మంచి చెడు నేర్పించే పాఠశాలలో కూడా..
దీన్ని ఎదురుకొని నిలబడే వారు ఎవరు? ఇక్కడ ఇలా అన్యాయం జరిగింది అని వెళ్తే…. అక్కడ ఇంకొక అన్యాయం…. ఇలా ఎంత కాలం..
చివరికి, తన కన్న కుతుర్ల మీద కన్ను వేసే నీచపు సమాజంలో ఉన్నాం….
మార్పు ఎక్కడ రావాలి… ఎదురుకోవాలి అనే మనలోనా…. లేక ఇలా చేసే అగంతుకులలోనా..
మన వారు లేరు పరాయి వారు లేరు.. పక్కింటోల్లు లేరు, ఎదురింటోల్లు లేరు..అందరూ అలాగే ఉన్నారు.
ఇలా ఉన్నంత కాలం మన ఇంటి ఆడపిల్లకు కూడా న్యాయం జరగదు…
అన్యాయాన్ని ఎదురుంచలేక న్యాయం కళ్ళకు గంతలు కట్టుకుని ఉంది..
ప్రతి ఆడపిల్లను చుసేటపుడు..
మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది..
మనకు జన్మనిచ్చే ఆ తల్లిని ఎందుకు దుర్మార్గంగా చూడాలి నీచంగా చూడాలి…
ఇక్కడ ఆడదాని జీవితం కాదు.. మగాడి బుద్ది చెడిపోయింది.. వాడు బాగానే ఉన్నాడు..
మరి వాడిని కన్న అమ్మ …
తను ఎలాంటి వాడికి జన్మనిచ్చింది అనే విషయం తెలిసి.. ఆ తల్లి గుండె బద్దలు అయి ఉంటది..
ఇలా రక రకాలుగా ఎక్కడ న్యాయమా నీవు ఎక్కడ ఉన్నావు..ఎందుకు ఇంకా అన్యాయాన్ని ఎదురించడానికి రావడం లేదు .
ఎవరికి ఎవరు రారు.. తోడు.
మాకు మేమే మాకు మా ఆత్మ బలమే రక్ష అనుకుంటూ బతుకడమే…
న్యాయం కావాలి అనే వారు కూడా అన్యాయంగా..
అన్యాయం చేసినవాడు కూడా న్యాయం కోసం పోరాడుతుంటే..
ఇక్కడ అన్యాయానికి నేను బలి అవ్వాలో అని న్యాయం తప్పించుకుని తిరుగుతున్నట్టు ఉంది.
– వనీత రెడ్డి