నువ్వేనా? నువ్వుగా ఉన్న ఎవరోనా?
నా మనసుకు..
ఎందుకలా అనిపిస్తుంది?
నీ ఊహలోనె ఆనందం..
వెతుక్కునే నేను..
ఇప్పుడు నిన్ను నమ్మలేక పోతున్నా!
నువ్వు నవ్వు లా లేవని..
తెలుస్తుంది..
నీ రాక నా బ్రతుకులో..
పున్నమి వెన్నెలలా..
కాంతులు వెదజల్లేది..
ఇప్పటి నీ రాక అమావాస్య..
చీకటిలా నన్ను ముసురు కుంటుంది…
ఏదో మార్పు సంభవించింది..
మన జీవితాల్లో!!
అది తెలుసు కోలేనంత..
చిన్నవాడివేం కాదు కదా!
ఈ సమస్య ఎలా పరిష్కార..
మవుతుందో నువ్వే చెప్పు..
మారిన నా ప్రియతమా!!
– ఉమాదేవి ఎర్రం